
సాక్షి, కొడంగల్: అన్ని ఆధారాలతోనే ఏపీ టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశానని టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో ఆదివారం ఆయన తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సరైన సమయంలో అందరి బండారం బయటపెడతానని హెచ్చరించారు. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతానని, ఆ తర్వాతే తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీచేస్తానని ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోరాటం కొనసాగిస్తానని పునరుద్ఘాటించారు. కాగా, పొత్తులు, తాను పార్టీ మారడం గురించి రేవంత్‌రెడ్డి స్పందించలేదు. మరోవైపు హైదరాబాద్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో అత్యవసరంగా సమావేశమై రేవంత్ వ్యవహారంపై చర్చించింది. ఆయన అందుబాటులో లేని సమయంలో టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.