సాక్షి,కొడంగల్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్,ఇతర ఉన్నతాధికారులపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాడి ఘటనలో ఏ2 నిందితుడు బోగమోని సురేష్ కొడంగల్ కోర్టు ముందు సురేష్ లొంగిపోయాడు. దీంతో లగచర్ల దాడి ఘటన కేసులో ఏ2గా ఉన్న సురేష్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు మాత్రం సురేష్‌కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఫార్మా నిర్వాసిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణపై గ్రామసభ నిర్వహించేందుకు దుద్యాల మండలం లగచర్లకు వచ్చిన అధికారులపై విరుచుకుపడ్డారు. పచ్చని పొలాల్లో విషం నింపొద్దని, తమ భూముల్లోకి ఫార్మాను రానిచ్చేది లేదంటూ మండిపడ్డారు.
లగచర్లలో ఏం జరిగిందంటే?
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ‘కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కడా)’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో వెంటాడారు. వాహనాలను ధ్వంసం చేశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై ఓ మహిళా రైతు చేయి చేసుకోగా.. కొందరు ఆందోళనకారులు కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిని పరుగెత్తిస్తూ వెంటపడి దాడి చేశారు. రైతుల ఆగ్రహాన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లను కారులో ఎక్కించి అక్కడి నుంచి పంపేశారు. కానీ కొందరు రైతులు వెంబడించి రాళ్లు రువ్వడంతో వాహనం అద్దాలు పగిలిపోయాయి.
ఈ ఘటనను ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కలెక్టర్ సహా అధికార యంత్రాంగంపై దాడికి నిరసన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. లగచర్లలో ఉన్నతాధికారులపై దాడి ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడి కారణమైన వారిని అదుపులోకి తీసుకోవాలని తెలంగాణ డీజీపీ జితేందర్.. ఏడీజీ మహేశ్ భగవత్‌కు ఆదేశాలు జారీ చేశారు.
విచారణ చేపట్టిన ఏడీజీ మహేశ్ భగవత్.. దాడి ఘటనలో రాజకీయ కోణం ఉందని తెలిపారు. అంతేకాదు ఏ2 ముద్దాయిగా బోగమోని సురేష్‌ను చేర్చారు. కేసు విచారణ కొనసాగుతుండగా.. కొద్ది సేపటి క్రితం కోడంగల్ కోర్టు ఎదుట బోగమోని సురేష్ లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment