అఖిలపక్ష నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి
కొడంగల్ : పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు చేయడాన్ని తాము వ్యతిరేకించడంలేదని ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. సోమవారం కొడంగల్‌లో అఖిలపక్ష నాయకులతో ఆయన మాట్లాడారు.
కొడంగల్ : పాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు చేయడాన్ని తాము వ్యతిరేకించడంలేదని ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. అయితే నియోజకవర్గ ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. సోమవారం కొడంగల్‌లో అఖిలపక్ష నాయకులతో ఆయన మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో కలపాల్సి వస్తే కొడంగల్‌ను డివిజన్ కేంద్రంగా మార్చాలని లేదంటే షాద్‌నగర్‌ను జిల్లాగా ప్రకటించి అందులో కలపాలన్నారు. అదీకాకుంటే యధాతథస్థితి కొనసాగించాలన్నారు. కోస్గి, మద్దూరులను మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచి మిగిలిన మూడు మండలాలను రంగారెడ్డిలోకి మార్చాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తాము న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఇందనూర్ బషీర్, కష్ణంరాజు, చంద్రప్ప, దుబ్బాస్ కిష్టయ్య, మహ్మద్ యూసూఫ్, నందారం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.