ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు | lod Venkateshawara swami spcial programs | Sakshi
Sakshi News home page

ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు

Published Mon, Aug 1 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

హోమం నిర్వహిస్తున్న వేదపండితులు

హోమం నిర్వహిస్తున్న వేదపండితులు

కొడంగల్‌ : టీటీడీ ఆధ్వర్యంలో స్థానిక వేంకటేశ్వర ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆదివారం చివరిరోజు కావడంతో టీటీడీ బోర్డు సభ్యుడు ఏవీ రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

వరహాస్వామి సన్నిధిలో  ప్రత్యేక హోమాలు జరిపించారు. వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారు సుందరవరద భట్టాచార్యుల వేదమంత్రోచ్చరణల మధ్య ఉదయం 9 నుంచి 12 గంటల వరకు హోమాలు నిర్వహించారు. వందలాది మంది దంపతులు పాల్గొని గోత్రనామాలతో సంకల్పం చేశారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌ పూజల్లో పాల్గొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement