pavitrotsavalu
-
తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ముగిసిన పవిత్రోత్సవాలు
-
ఈ నెల 14న దుర్గమ్మ దర్శనం నిలిపివేత
ఇంద్రకీలాద్రి : భాద్రపద శుద్ధ త్రయోదశి 14వ తేదీ నుంచి 17వ తేదీ బహుళ పాడ్యమి వరకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన మహానివేదన అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆలయంలో అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి15వ తేదీ తెల్లవారుజామున స్నపనాభిషేకం, అలంకరణ, నిత్యపూజల తర్వాత ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. -
ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు
కొడంగల్ : టీటీడీ ఆధ్వర్యంలో స్థానిక వేంకటేశ్వర ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆదివారం చివరిరోజు కావడంతో టీటీడీ బోర్డు సభ్యుడు ఏవీ రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వరహాస్వామి సన్నిధిలో ప్రత్యేక హోమాలు జరిపించారు. వైఖానస ఆగమ శాస్త్ర సలహాదారు సుందరవరద భట్టాచార్యుల వేదమంత్రోచ్చరణల మధ్య ఉదయం 9 నుంచి 12 గంటల వరకు హోమాలు నిర్వహించారు. వందలాది మంది దంపతులు పాల్గొని గోత్రనామాలతో సంకల్పం చేశారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్ పూజల్లో పాల్గొన్నారు. -
6 నుంచి తిరుచానూరులో పవిత్రోత్సవాలు
5వ తేదీ సాయంత్రం అంకురార్పణ 8వ తేదీ పుష్కరిణిలో చక్రస్నానం తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. అమ్మవారి నిత్య, వార, మాస, వార్షిక ఉత్సవాలు, నిత్య పూజాది కార్యక్రమాల్లో తెలిసీతెలియక జరిగిన తప్పులతో ఏర్పడ్డ దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేయనున్న యాగశాలలో 6వ తేదీ పవిత్ర ప్రతిష్ఠ, 7వ తేదీ పవిత్ర సమర్పణ, 8వ తేదీ పవిత్ర విసర్జన పూజలు నిర్వహించనున్నారు. కాగా పవిత్రోత్సవాలను పురస్కరించుకుని 5వ తేదీ సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. పవిత్రోత్సవాల్లో చివరి రోజైన 8వ తేదీ సాయంత్రం అమ్మవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాలకు రూ.750 టికెట్టు కొనుగోలు చేసిన భక్తులు ఇద్దరిని అనుమతించనున్నారు. నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. 18 రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో తయారుచేసిన లేపనంతో ఆలయ సన్నిధి గోడలను శుభ్రం చేయనున్నారు. 9 గంటల తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సేవలు రద్దు పవిత్రోత్సవాల సందర్భంగా 2, 5 తేదీల్లో కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవను రద్దు చేశారు. అలాగే 6, 7, 8 తేదీల్లోనూ కల్యాణోత్సవం, లక్ష్మీపూజ, ఊంజల్‌సేవతో పాటు వారపు సేవలైన పుష్పాంజలి, అష్టదళ పాదపద్మారాధన రద్దు చేశారు. -
వైభవంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
పెనుగంచిప్రోలు, న్యూస్‌లైన్: గ్రామంలోని శ్రీతిరుపతమ్మవారి ఆలయంలో తొలి పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ఈవో ఎన్.విజయ్‌కుమార్, చైర్మన్ నెల్లూరి గోపాలరావు గణపతి పూజ అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. తొలిసారిగా పవిత్రోత్సవాలు నిర్వహించనుండడంతో ఏర్పాట్లు పటిష్టంగా చేశారు. ఉదయం మండపారాధన, సాయంత్రం అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రికి ఆలయం చుట్టూ అమ్మవారి ఊరేగింపు, పంచహారతుల అనంతరం దేవతామూర్తులకు పవిత్రములు ధరింపజేశారు. ఉత్సవాల ప్రారంభంతోపాటు శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని పాలు, పొంగళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ వైకుంఠరావు, ఏఈఓలు ప్రసాదరావు, గోపాలరావు, సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, పాల్గొన్నారు. -
భద్రాచలంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు
శ్రావణమాసం సందర్భంగా భద్రాచలంలోని శ్రీరామచంద్రుని దేవాలయంలో నేటి నుంచి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు శుక్రవారం భద్రాచలంలో వెల్లడించారు.ఆ పవిత్రోత్సవాలు ఈ నెల 21తో ముగుస్తాయని తెలిపారు. పవిత్రోత్సవాలు సందర్భంగా దేవాలయంలో భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఆ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు ఈ రోజు తెల్లవారుజాము నుంచే స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. అయితే కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణమాసంలో వచ్చే రెండో శుక్రవారం కావడంతో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అత్యంత పర్వదినమైన ఈ రోజు భక్తుల కోసం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయం కార్యనిర్వహాణాధికారి చంద్రశేఖర ఆజాద్ వెల్లడించారు. ఆ వ్రతాల్లో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రితోపాటు వెండి లక్ష్మీదేవి రూపు ఉచితంగా అందజేయనున్నట్లు ఈవో తెలిపారు.