ఈ నెల 14న దుర్గమ్మ దర్శనం నిలిపివేత
ఈ నెల 14న దుర్గమ్మ దర్శనం నిలిపివేత
Published Sun, Sep 11 2016 5:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
ఇంద్రకీలాద్రి : భాద్రపద శుద్ధ త్రయోదశి 14వ తేదీ నుంచి 17వ తేదీ బహుళ పాడ్యమి వరకు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీన మహానివేదన అనంతరం ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆలయంలో అన్ని దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి15వ తేదీ తెల్లవారుజామున స్నపనాభిషేకం, అలంకరణ, నిత్యపూజల తర్వాత ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement