‘దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి మీటింగ్‌ పెట్టు’ | Revanth Reddy Open Challenge to Telangana CM KCR | Sakshi
Sakshi News home page

‘దమ్ముంటే కొడంగల్‌కు వచ్చి మీటింగ్‌ పెట్టు’

Published Wed, Nov 8 2017 5:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Revanth Reddy Open Challenge to Telangana CM KCR - Sakshi

సాక్షి, మహబూబ్ నగర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే, నీవు తెలంగాణ బిడ్డవే అయితే కొడంగల్‌కు వచ్చి మీటింగ్ పెట్టు మా కార్యకర్తల దమ్మేంటో తెలుస్తుందని.. కొడంగల్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కోస్గిలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..కేసీఆర్‌ చెంచా గుర్నాథ్ రెడ్డి గడీ మీద రెండు సార్లు జెండా ఎగరవేశామని అన్నారు. ఇప్పుడు తన మీద తాండూరులో  చెల్లని రూపాయిని దింపి చెల్లిపిస్తాడని మాట్లాడుతున్నాడని కేసీఆర్‌నుద్దేశించి విమర్శించారు.

నాడు డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.250 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం తీసుకొచ్చానని ఆయన చెప్పారు. 2007లో భీమా ప్రాజెక్టును తాము సాధించుకున్నామని, నేడు తమ మీద కక్షతో భీమా ప్రాజెక్టులు పూర్తి కాకుండా పక్కకు పెట్టారని రేవంత్‌ ఆరోపించారు. కొడంగల్ అభివృద్దిని అడ్డుకుంటుంది టీఆర్ఎస్ పార్టీనేనని ఆయన అన్నారు. నందారం వెంకటయ్య చివరి కోరిక కోస్గిలో బస్ డిపో నిర్మాణమని.. ఇందుకోసం తాను.. తన సోదరుడి పేరుమీద 4 ఎకరాలు కొనుగోలు చేసి అప్పగించామని..40 నెలలైనా ఎందుకు బస్ డిపో నిర్మాణానికి టెండర్లు పిలవడం లేదని రేవంత్‌ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ, కొడంగల్ ప్రజల ఆత్మగౌరవం పెంచేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్‌పై పోరాటం చేస్తున్నానని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement