
కొడంగల్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కొడంగల్ ప్రజల పౌరుషాన్ని రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాక్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్‌లో విలేకరులతో మాట్లాడారు. మాతో పెట్టుకున్న వారెవరూ బతికి బట్టకట్టలేదని అన్నారు. రాజకీయంలో మాతో గోక్కున్న గుర్నాథ్ రెడ్డి కాలగర్భంలో కలిసి పోయారని తెలిపారు. గుర్నాథ్ రెడ్డి కాలం బాగా లేక అట్లున్నాడు కానీ కేసీఆర్ కంటే గుర్నాథ్ రెడ్డి ఎన్నో రెట్లు మేలు, నిజాయతీపరుడు కూడా అని అన్నారు. కేసీఆర్‌ని సింహం..సింహం సింగిల్‌గా వస్తుందని కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తూ కేసీఆర్ సింహం కాదు గుంట నక్క..గుంట నక్క కూడా సింగిల్‌గా వస్తుందని ఎద్దేవా చేశారు.
కొడంగల్ ప్రజల వల్లే తానింత పెద్ద నాయకుడిగా ఎదిగానని, తాను కొడంగల్ ప్రజలు నాటిన మొక్కను అని అన్నారు. ఆ మొక్క ఈ రోజు పెద్దదై చెట్టుగా కాయలు కాయడానికి వస్తోందని, కాయలు ఇచ్చే సమయానికి చెట్టునే లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని కొడంగల్ ప్రజలు ఆ చెట్టును జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు. తన అనుచరులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్గిగా బుద్ధి చెప్పాలని కొడంగల్ ప్రజలను రేవంత్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment