![‘లగడపాటి ఆస్తులపై విచారణ జరపాలి’](/styles/webp/s3/article_images/2017/09/2/71383727679_625x300_0.jpg.webp?itok=LbCTWT-5)
‘లగడపాటి ఆస్తులపై విచారణ జరపాలి’
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆర్థిక కార్యకలాపాలపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. లగడపాటి అక్రమ ఆస్తులపై విచారణ చేపట్టాలని త్వరలో సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్‌తో కలిసి ఎంపీలు పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, రాజయ్య, మధుయాష్కీగౌడ్, సురేష్ శెట్కార్‌లు గురువారం విలేకరులతో మాట్లాడారు.