లగడపాటి రాజగోపాల్ (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన ల్యాంకో తీస్థా హైడ్రో పవర్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలోని పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.313.1 కోట్ల అప్పును చెల్లించే పరిస్థితిలో సంస్థ లేదని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ–హైదరాబాద్) తేల్చింది. దాంతో దివాలా ప్రక్రియను (ఐసీపీఆర్) ప్రారంభిస్తున్నట్లు పేర్కొం ది. హుజేఫా సితాబ్‌ఖాన్‌ను దివాలా పరిష్కార నిపుణుడు (ఐఆర్‌పీ)గా నియమించింది.
‘‘ల్యాంకో తీస్థా తన ఆస్తుల విక్రయం, బదలాయింపు, తాకట్టు వం టివి చేయరాదు. దివాలా ప్రక్రియ మొదలైనట్టు ఐఆర్‌పీ ప్రకటన ఇవ్వాలి. ఇన్సాల్వెన్సీ, బ్యాం క్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు మీడియా ద్వారా ప్రకటనలివ్వాలి. రుణదాతలతో కమిటీ వేసి సంస్థ ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాలి’’ అని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్ సభ్యుడు విత్తనాల రాజేశ్వరరావు ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులిచ్చారు.
సిక్కింలో తీస్థా నదిపై 500 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఐసీఐసీఐ బ్యాంకు నేతృత్వంలో పలు బ్యాంకుల నుంచి 2007లో ల్యాంకో రూ.400 కోట్ల రుణం తీసుకుంది. రుణం చెల్లించకపోవడంతో ల్యాంకో రుణ ఖాతాను నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తూ ఐసీఐసీఐ నేతృత్వంలోని బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరం (జేఎల్‌ఎఫ్) నోటీసు జారీ చేసింది. 2017 నవంబర్ 30 నాటికి రుణ బకాయి రూ.313.1 కోట్లకు చేరింది. హైడ్రో ఎలక్ట్రికల్, గ్యాస్ ఆధారిత విద్యుత్కేంద్రాల పరిస్థితి తిరోగమనంలోకి వెళ్లడంతో తమకు తీరని నష్టం కలిగిందన్న ల్యాంకో తీస్థా న్యాయవాది రవికుమార్ వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment