పెప్పర్ ప్రభావం ఏ‘పాటి’ | How long do the effects of pepper spray | Sakshi
Sakshi News home page

పెప్పర్ ప్రభావం ఏ‘పాటి’

Published Fri, Feb 14 2014 2:11 PM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM

పెప్పర్ ప్రభావం ఏ‘పాటి’

పెప్పర్ ప్రభావం ఏ‘పాటి’

 సాక్షి, విజయవాడ : గత ఏడాది ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో మహిళా ఉద్యోగులు తమ రక్షణ కోసం  పెప్పర్ స్ప్రే ఉపయోగించడం మొదలు పెట్టారు. మెట్రో నగరాల్లో ఎక్కువగా సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగులకు మాత్రమే పరిమితమయిన పెప్పర్ స్ప్రే గురువారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. లోక్‌సభలో తనపై దాడి చేస్తున్న తెలంగాణా ఎంపీల నుంచి తప్పించుకునేందుకు లగడపాటి పెప్పర్ స్ప్రే  వాడారు. దీంతో లోక్‌సభలో కలకలం చెలరేగింది. దాని ఘాటుకు తట్టుకోలేక కొందరు ఆస్పత్రి పాలవ్వగా, ఎంపీలందరూ భయంతో బయటకు పరుగులు తీశారు.
 
 ఏంటీ పెప్పర్‌స్ప్రే...
 పెప్పర్ స్ప్రే   ప్రాణాంతకమైంది కాదు. దీన్ని స్ప్రే చేయగానే  వెంటనే కళ్లు మండుతాయి. కొద్ది సేపటి వరకూ కళ్లు తెరవలేము. శ్వాస ఇబ్బంది అవుతుంది. దాని ఘాటుకు తుమ్ములొస్తాయి. ముక్కు నుంచి నీరు కారుతుంది. దగ్గు వస్తుంది.  స్ప్రే ఎంత దగ్గర నుంచి ఎంత మోతాదులో వాడతామనే దానిపై ప్రభావం ఆదార పడి ఉంటుంది. దీని పూర్తి ప్రభావం తగ్గడానికి ఆరగంట నుంచి గంట వరకూ సమయం పడుతుంది. ఒకసారి స్ప్రే చేయడం వల్ల కళ్లకు  ఎటువంటి హాని ఉండదు. ఆస్తమా ఉన్న రోగులకు మాత్రమే కొంత ఇబ్బంది కరంగా ఉంటుంది.  ఈ పెప్పర్ స్ప్రే  చేతిలో ఇమిడిపోయే బాటిల్స్‌లో మార్కెట్ అందుబాటులో ఉంది. మహిళలు ఆకతాయిల నుంచి అత్మరక్షణ కోసం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement