
దిగ్విజయ్ మాటకు విలువలేదు: లగడపాటి
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నాయకులు విరుద్ధ వ్యాఖ్యలతో అయోమయం సృష్టిస్తున్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ నాయకులు విరుద్ధ వ్యాఖ్యలతో అయోమయం సృష్టిస్తున్నారు. విభజనకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అంగీకరించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పేర్కొనగా, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిగ్విజయ్పై ధ్వజమెత్తాడు.
దిగ్విజయ్ సింగ్ మాటలు నీట మీద రాతలేనని లగడపాటి విమర్శించారు. దిగ్విజయ్ ఏనాడు మాట మీట నిలబడలేదని ఆరోపించారు. ఇలా కాంగ్రెస్ నాయకులే పరస్పర విమర్శలకు దిగుతూ ప్రజలను తికమకపెడుతున్నారు.