
‘ఎంపీ లగడపాటికి సీడబ్యూసీలో ప్రాధాన్యత లేదు’
కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్యూసీ)లో ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ రాష్ట్ర సలహాదారు దిగ్విజయ్ సింగ్ తెలిపారు
ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్యూసీ)లో ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ రాష్ట్ర సలహాదారు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈ రోజు తెలంగాణ అంశానికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సమైక్యానికే కట్టుబడి ఉండేటట్లు కృషి చేస్తాన న్న లగడపాటి వ్యాఖ్యలను ఉద్దేశించి దిగ్విజయ్ మాట్లాడారు. లగడపాటి సీడబ్యూసీ కంటే ఉన్నతుడు ఏమీ కాదని ఆయన చురకలంటించారు. ఎంపీ లగడపాటి సహా ఇతర మంత్రులు మీడియా ఎక్కడం మానుకోవాలని ఆయన సూచించారు.
సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టదని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతలకు ఏమైనా అపోహలుంటే ఆంటోని కమిటీకి నివేదించవచ్చన్నారు.