విభజన జరిగితే రాజకీయాలకు గుడ్ బై: లగడపాటి
రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని, రాష్ట్ర విభజన జరగదని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో ఆయన శనివారం సమావేశమయ్యారు.
వచ్చే ఏడాది సమైక్యరాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని లగడపాటి చెప్పారు. విభజనకు వ్యతిరేకంగా మాట్లాడినవారిపై చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరూ మిగలరని పేర్కొన్నారు. విభజన జరిగిపోతోందని చెబుతున్న సీమాంధ్ర నేతలు, జరగకపోతే తామేం చేస్తారే చెప్పాలని రాజగోపాల్ వ్యాఖ్యానించారు.