ఉద్యమ స్థైర్యం (2013 రౌండప్) | Movement Resolution (2013 Roundup) | Sakshi
Sakshi News home page

ఉద్యమ స్థైర్యం (2013 రౌండప్)

Published Fri, Dec 27 2013 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

ఉద్యమ స్థైర్యం (2013 రౌండప్)

ఉద్యమ స్థైర్యం (2013 రౌండప్)

జిల్లాలో షర్మిల సమైక్య శంఖారావం

 సమైక్య ఉద్యమానికి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో, గుంటూరు వేదికగా వైఎస్ విజయమ్మ ఆమరణ దీక్షలు చేపట్టి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. విజయమ్మ తొలుత విజయవాడలో దీక్ష చేపట్టాలని నిర్ణయించగా, అవనిగడ్డ ఉప ఎన్నికల కోడ్ కారణంగా గుంటూరులో నిర్వహించారు. షర్మిల జిల్లాలోని అవనిగడ్డ నుంచి కైకలూరు వరకు సమైక్య శంఖారావం యాత్ర నిర్వహించి అందరిలో ఉద్యమ స్ఫూర్తి తెచ్చారు. అలాగే, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను నేతృత్వంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన దీక్షలు, ఆందోళన నిర్వహించాయి. ఎంవీఎస్ నాగిరెడ్డి, యెర్నేని నాగేంద్రనాథ్ వంటి నేతలు రైతులను సైతం ఉద్యమంలో భాగస్వాముల్ని చేశారు. విజయవాడలో యూఎస్‌వో నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విద్యార్థి ఉద్యమం సాగింది. జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితర నేతలు జనంలోకి వెళ్లలేకపోయారు. విభజనకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వడంతో జిల్లాకు చెందిన తెలుగు తమ్ముళ్లు రెండు నాల్కల ధోరణి అవలంబించలేక సతమతమయ్యారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సమన్యాయం అంటూ జిల్లాలో బస్సు యాత్రకు వచ్చారు. ప్రజా స్పందన లేకపోవడంతో అర్థంతరంగా నిలిపివేశారు.
 
 పోరాట ఖిల్లా.. కృష్ణాజిల్లా..

 నిరంతరం సమైక్యత కోసం పాటుపడిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో కేంద్రంలోని యూపీఏ సర్కారు 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుకు సంకేతాలు ఇచ్చింది. అప్పట్లో జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగింది. అనంతరం రాష్ట్ర విభజన ప్రక్రియను మరింత వేగిరం చేస్తూ గత జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో సమైక్య రాష్ట్రం కోసం మళ్లీ పోరుబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలో ఉద్యోగులు 66 రోజులు సమ్మెబాట పట్టగా, ప్రజలు మాత్రం 150రోజులకుపైగా ఉద్యమ బావుటా ఎగురవేశారు. ఏపీఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు కదం తొక్కాయి. ఆగస్టు 12 అర్ధరాత్రి నుంచి జిల్లాలో పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె మొదలైంది. సుమారు 35వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు.
 
జిల్లా అంతటా ఉద్యమం


 రాష్ట్రస్థాయిలో సమైక్య ఉద్యమానికి ఊపిరిలూదిన పరుచూరి అశోక్‌బాబు అవనిగడ్డ నియోజకవర్గానికి చెందినవాడు కావడం విశేషం. విజయవాడ, హనుమాన్ జంక్షన్, గుడివాడ, ఉయ్యూరుల్లో జరిగిన సమైక్య గర్జన సభలకు అశోక్‌బాబు, మిగిలిన రాష్ట్ర నాయకులు హాజరై ఉత్తేజపరిచే ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. బందరులో సెప్టెంబర్ 19న నిర్వహించిన గర్జనలో ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ పాల్గొని జిల్లా గొప్పతనాన్ని వివరించారు. రాష్ట్రస్థాయి సమైక్య పోరులో ఒక వెలుగు వెలిగిన వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మన జిల్లా ఆడపడుచే కావడం విశేషం. అలాగే, మనజిల్లాకు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
 
 జీతాల్లేవ్..


 జిల్లాలోని ఖజానా శాఖ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు సంక్షోభాన్నే మిగిల్చింది. ట్రెజరీల్లో పనిచేస్తున్న సుమారు 175మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. మచిలీపట్నం ట్రెజరీ ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాలోని 18 సబ్ ట్రెజరీ కార్యాయాల్లో కార్యాకలపాలు స్తంభించారుు. ఉద్యోగుల వేతనాల బిల్లులు, పలు అభివృద్ధి పనులకు విఘాతం ఏర్పడింది.
 
 ఉద్యమంలో ఉద్యోగులు, విద్యార్థులు


 జిల్లాలో ఆగస్టు 22 నుంచి విద్యాసంస్థలు బంద్ పాటించారుు. 3,340 సర్కారీ బడుల్లో పనిచేస్తున్న సుమారు 16వేల మంది ఉపాధ్యాయుల్లో చాలామంది విధులు బహిష్కరించారు. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యా సంవత్సారాన్ని నష్టపోయారు. 16 శాఖలకు చెందిన అధికార యంత్రాంగం ఆగస్టు 28 నుంచి సమ్మెబాట పట్టడంతో పాలన పడకేసింది. జిల్లాలోని మండల లెవెల్ స్టాక్‌పాయింట్ పాయింట్ల నిర్వాహకులు సైతం సమ్మెబాట పట్టడంతో అమ్మహస్తం, కిరోసిన్ వంటి సరుకుల పంపిణీ నిలిచిపోయింది. పింఛన్లూ ఆలస్యంగానే పంపిణీ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయ, ఆక్వా రంగాలతో పాటు ప్రజలు నిత్యం సమస్యలతో సతమతమయ్యారు. ప్రజావాణి జరగకపోవడంతో ప్రజల మొరవినే వారు కరువయ్యారు. జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖకు సమ్మె సెగ తగిలింది. జిల్లా కేంద్ర ఆస్పత్రితో పాటు 79 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఏఎన్‌ఎంలు, ప్రభుత్వ వైద్యులు, వైద్య ఆరోగ్య సిబ్బంది సుమారు మూడువేల మంది వరకు సమ్మెబాట పట్టారు.
 
 బిగిసిన పిడికిళ్లు..
 = జిల్లాలో ఈ ఏడాది సమైక్య పోరు ఒక మైలురాయి కాగా, ఏడాది కాలంలో మరిన్ని ఉద్యమాలు సాగాయి. జిల్లాలో రైతులకు సకాలంలో సాగు నీరివ్వాలని, కరెంట్ సరఫరా సక్రమంగా సాగాలని, మద్దతు ధర ఇవ్వాలని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, రైతు విభాగ రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి.
 =పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రెండు పర్యాయాలు కలెక్టరేట్ వద్ద ఆందోళనలు నిర్వహించారు.
 =అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20, 21 సమ్మె చేశారు. జూలై 10న, డిసెంబర్‌లోనూ నల్లచీరలతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు.
 =మునిసిపల్ వర్కర్ల సమస్యలపై విజయవాడ కార్పొరేషన్‌తోపాటు మచిలీపట్నం, గుడివాడ, పెడన, నూజివీడు, జగ్గయ్యపేట మునిసిపాలిటీల్లో ఉద్యమం చేపట్టారు.
 =అర్హులైన పేదలకు భూములు పంచాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
 =పెనుగంచిప్రోలు మండలం కొణకంచిలో సారా నిషేధించాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
 =తిరుపతమ్మ ఆలయంలో ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా విధులు బహిష్కరించారు.
 =బందరు పోర్టు సాధనకు 358 రోజులుగా దీక్షలు కొసాగుతూనే ఉన్నాయి.
 
 విద్యుత్ మెరుపు సమ్మెతో కలవరం


 సమైక్య నినాదంతో విద్యుత్ ఉద్యోగులు నిర్వహించిన మెరుపు సమ్మెతో ప్రభుత్వం కలవరపడింది. అయితే, ప్రజలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో వారు మూడు రోజుల తరువాత విరమించారు. జిల్లాలోని ట్రాన్స్‌కో ఉద్యోగులు సుమారు 3వేల మంది, జెన్‌కో ఉద్యోగులు సుమారు 5వేల మంది ఐదు రోజులు సమ్మె చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement