చివరివరకూ పోరాటం చేశాం: లగడపాటి | Lagadapati Rajagopal quits politics | Sakshi
Sakshi News home page

చివరివరకూ పోరాటం చేశాం: లగడపాటి

Published Wed, Feb 19 2014 12:20 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

చివరివరకూ పోరాటం చేశాం: లగడపాటి - Sakshi

చివరివరకూ పోరాటం చేశాం: లగడపాటి

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇకనుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు చివరికంటా పోరాటం చేశామని ఆయన బుధవారిమిక్కడ అన్నారు.  రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది కాబట్టి..ఇకపై తెలుగు ప్రజల ఐక్యత కోసం కృషి చేస్తానని లగడపాటి  తెలిపారు. జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి భావోద్వేగాలు, సెంటిమెంట్లను మరచి తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement