lagadapati raja gopal
-
చిలుక జోస్యం కోసం ఖజానా లూటీ!
సాక్షి, అమరావతి: ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడే తన గూటి చిలుక లగడపాటి రాజగోపాల్‌కు చెందిన బినామీ కాంట్రాక్టు సంస్థకు రూ.1,240.85 కోట్ల విలువైన పనులు అప్పగించిన చంద్రబాబు, పనిలో పనిగా ఖజానా నుంచి రూ.124 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్సు ఇప్పించేశారు. ఆ సొమ్ముతో పోలింగ్ పూర్తయిన తర్వాత తూర్పుగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని 38 నియోజకవర్గాల్లో లగడపాటి ఫ్లాష్ సర్వే చేయించి.. ఆ ఫలితాలనే 175 నియోజకవర్గాలకు వర్తింపజేశారు. తరువాత చంద్రబాబు తన పలుకులనే పెంపుడు చిలుకతో శనివారం వల్లింపజేశారు. తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో రీ పోలింగ్ సందర్భంగా ఓటర్లను ప్రభావితం చేయడానికే చిలుకతో ముందు కూయించి, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. కళ్లెదుట ఓటమి సాక్షాత్కరిస్తున్న వేళ.. ఆదివారం మరో అడుగు ముందుకేసి చిలుకతో అశాస్త్రీయమైన సర్వే లెక్కలను వల్లింపజేసి.. కౌంటింగ్ వరకూ టీడీపీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోశారు. చివరకు టీడీపీ ఓటమికి ఈవీఎంలే కారణమని వక్రీకరించి.. కౌంటింగ్ రోజున ఉద్రిక్త పరిస్థితులను సృష్టించే కుట్రలకు చంద్రబాబు పదును పెట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కుట్రలకు ప్రభుత్వ ఖజానా నుంచే నిధులను దోచిపెట్టడాన్ని రాజకీయ విశ్లేషకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఖజానా నుంచే సర్దుబాటు ఎన్నికల్లో ప్రజల నాడిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి లగడపాటి రాజగోపాల్‌తో సర్వేలు చేయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వ ఖజానా నుంచే సర్దుబాటు చేయడానికి ప్రణాళిక రచించారు. అందులో భాగంగా హైడ్రలాజికల్ క్లియరెన్స్ తీసుకోకుండానే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్), యోగి వేమన రిజర్వాయర్ (వైవీఆర్), హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతలను మంజూరు చేశారు. ఉజ్జాయింపు అంచనాల ఆధారంగా రూ.1,182.33 కోట్లతో ఈ పనులకు టెండర్లు పిలిచి.. కాంట్రాక్టర్లు కుమ్మక్కయేలా చక్రం తిప్పారు. లగడపాటి బినామీకి చెందిన పవర్ మ్యాక్స్–ష్యూ (జేవీ) సంస్థకు రూ.1,240.85 కోట్ల విలువైన ఆ పనులు దక్కేలా చేశారు. జాయింట్ వెంచర్(జేవీ)లో ప్రధాన వాటాదారు అయిన పవర్ మ్యాక్స్‌కు సాగునీటి ప్రాజెక్టుల పనులు, ఎత్తిపోతల పనులు చేసిన అనుభవం లేదు. అందులో భాగస్వామి అయిన ష్యూ సంస్థ కూడా పనులు చేసిన అనుభవంపై ‘ఎక్సీ్పరియన్స్’ సర్టిఫికెట్స్‌ను షెడ్యూల్‌కు జత చేయలేదు. దీన్నే ఎత్తిచూపుతూ అక్రమాలు జరిగినట్టు నిర్థారణకు వచ్చిన కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) మార్చి 1న ఆ టెండర్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. కానీ.. చంద్రబాబు ఒత్తిడితో ‘ఎక్సీ్పరియన్స్’ సర్టిఫికెట్లను సమర్పించడానికి మార్చి 7 వరకూ లగడపాటి బినామీ సంస్థకు గడువు ఇచ్చారు. మార్చి 7న రెండు దఫాలుగా సీవోటీ సమావేశాలు నిర్వహించినా.. ఎక్ప్సీరియన్స్ సర్టిఫికెట్లు సమర్పించడంలో ఆ సంస్థ విఫలమైనట్టు సీవోటీ వర్గాలు వెల్లడించాయి. సీఎం చంద్రబాబు ఒత్తిడి మేరకు ఎక్ప్సీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే సదరు సంస్థకు పనులు కట్టబెడుతూ సీవోటీ టెండర్‌ను ఆమోదించింది. ఈ పనులను ఆ సంస్థకు అప్పగిస్తూ ఈనెల 8న కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నట్టుగా ఆగమేఘాలపై పత్రాలు తయారు చేసేలా జలవనరుల శాఖ అధికారులపై సీఎం చంద్రబాబు ఒత్తిడి తెచ్చి.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఆ కాంట్రాక్ట్ ఒప్పందం ఆధారంగా అంచనా వ్యయంలో 10 శాతం అంటే రూ.124.08 కోట్లను మొబిలైజేషన్ అడ్వాన్సు కింద లగడపాటి బినామీ సంస్థకు చెల్లించేలా చక్రం తిప్పారు. ఈ డబ్బుతోనే ఎన్నికల్లో పలు సర్వేలు నిర్వహించిన లగడపాటి.. వాస్తవాలను చంద్రబాబు చెవిలో వేశారు. ఓటమి ఖాయమని తేలడంతో.. పోలింగ్ ముగిసీ ముగియక ముందే ఈవీఎంలపై ఆ నెపాన్ని నెట్టే రీతిలో చంద్రబాబు పల్లవి అందుకున్నారు. కౌంటింగ్ వరకు టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నూరిపోసి.. కౌంటింగ్ రోజున టీడీపీ ఓటమికి ఈవీఎంలే కారణమనే భావనను బలపరిచేలా చేసి.. ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడానికి లగడపాటితో ఆదివారం అశాస్త్రీయమైన సర్వే ఫలితాల పేరుతో తన పలుకులను పలికించారు. ఇదే అదునుగా తీసుకున్న లగడపాటి బెట్టింగ్ రాయుళ్లతో కుమ్మక్కై.. అశాస్త్రీయమైన సర్వే ద్వారా చంద్రబాబు పలుకులను వల్లె వేశారు. -
ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా 'ఒలింపిక్' ఎన్నికలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వేర్వురుగా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏప్రిల్ 19న రెండు రాష్ట్రాల కార్యవర్గాలను ఎన్నుకుంటామని ఆయన అన్నారు. ఒలింపిక్ ఉమ్మడి ఆస్తులను రెండు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు పంచుకుంటాయని చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని లగడపాటి రాజగోపాల్ తెలిపారు. -
బెట్టింగుల కోసమే లగడపాటి సర్వేలు
గుడివాడ : రాజకీయ సన్యాసం తీసుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ బెట్టిం గులను ప్రోత్సహించేందుకే ఓ పార్టీకి అనుకూలంగా సర్వే ఫలితాలంటూ ప్రకటిస్తున్నారని వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేశారు. లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మి బెట్టింగులకు పాల్పడి మోసపోవద్దని సూచించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో నాని బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ గాలి ఉన్నందున అన్ని సర్వేలు జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తున్నారని తేల్చిచెబుతుండటంతో పందేలు కాసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదని, దీంతో లగడపాటి తప్పుడు సర్వేలు ప్రకటించి అమాయకులను మోసగించేందుకు చూస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జయాపజయాలకు అనేక కారణాలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థి గుణగణాలతోపాటు, ఆర్థిక, సామాజిక అంశాలు, పార్టీ కేడర్‌ను బట్టి గెలుపు ఓటములు ఉంటాయని వివరించారు. సాధారణ ఎన్నికల్లో ఈ అంశాలేవీ ప్రభావం చూపబోవని, వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టంచేశారు. -
లగడపాటి సర్వేలను జనం నమ్మరు
సిద్దిపేటఅర్బన్, న్యూస్‌లైన్: సీమాం ధ్రలో వైఎస్సార్ సీపీ హవా చూసి కంగుతింటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లగడపాటి రాజగోపాల్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ సిద్దిపేట అసెంబ్లీ అభ్యర్థి తడ్క జగదీశ్వర్‌గుప్తా పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటికి వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజల్ని ఆయోమయానికి గురిచేస్తున్న లగడపాటి సర్వేలను జనం నమ్మరన్నారు.సర్వేలు చేయించి జనం మనవైపే ఉన్నారంటూ నమ్మించి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టించి కిరణ్‌కుమార్‌రెడ్డికి వెన్నుపోటు పొడిచిన ఘనత లగడపాటికే దక్కిందన్నారు. లగడపాటి మాటల్ని ప్రజలు పట్టించుకోరన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణితో ప్రజలను వంచిస్తూ దగాచేస్తున్న చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞానులుగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీమాంధ్రలో జగన్‌ను అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకొలేరన్నారు.సమావేశంలో పార్టీ నాయకులు అఖిల్, విజయ్, ప్రవీణ్, నారాయణ, రాజశేఖర్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
జానారెడ్డితో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాజీమంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ పెద్దలు వ్యవహరించిన తీరుపట్ల జానారెడ్డి తీవ్ర ఆవేదనకు లోనైన నేపథ్యంలో దిగ్విజయ్‌సింగ్ ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్.రఘువీరారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు డి.శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, షబ్బీర్‌అలీ కూడా దిగ్విజయ్‌తోపాటు జానారెడ్డిని కలిశారు. టీపీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో హైకమాండ్ అనుసరించిన తీరు, ఈ విషయంలో ఏర్పడిన గందరగోళంపై చర్చించుకున్నట్లు తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు రాహుల్‌గాంధీ కార్యాలయం ఫోన్‌చేసి ఢిల్లీ రావాలని కోరారని, ఆ సమయంలో జానారెడ్డికి ఫోన్‌చేసినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష నియామకం జరిగిందని దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది. జరిగినదంతా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్తో పొత్తు, కేసీఆర్ ప్రతిపాదనలపైనా వారి మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, పొత్తు సాధ్యంకాని పక్షంలో ఒంటరిగా పోటీచేసేలా కార్యకర్తలను సన్నద్ధం చేయాలని దిగ్విజయ్‌సింగ్ సూచించినట్లు సమాచారం. -
చివరివరకూ పోరాటం చేశాం: లగడపాటి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇకనుంచి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు చివరికంటా పోరాటం చేశామని ఆయన బుధవారిమిక్కడ అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభ ఆమోదం పొందింది కాబట్టి..ఇకపై తెలుగు ప్రజల ఐక్యత కోసం కృషి చేస్తానని లగడపాటి తెలిపారు. జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి భావోద్వేగాలు, సెంటిమెంట్లను మరచి తెలుగు ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని ఆయన కోరారు. -
తనకు తానే సమాధైన కాంగ్రెస్
సాక్షి, విజయవాడ : ఫిబ్రవరి 18.. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ తనకు తాను సమాధైన రోజు... ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారం. ఇది జిల్లా విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమవుతోంది. విభజన బిల్లుకు ఆమోదముద్ర పడిన వెంటనే అనేక మంది కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు మూతపడ్డాయి. మంత్రి పార్థసారథి తన పదవికి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు చేశారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. నగరానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ భవితవ్యంపై తర్జనభర్జన పడుతున్నారు. ‘ఒక పదవిని అడ్డం పెట్టుకుని ఎంతకాలం ఉంటారు. పదవులు వదిలి రండి. మిమ్మల్ని మళ్లీ గెలిపించే బాధ్యత మేం తీసుకుంటాం. రాజీనామాలు చేయకపోతే మీ రాజకీయ భవిష్యత్‌కు తెరపడినట్లే.’ అని ఉద్యోగ సంఘాలు విన్నవించినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కుర్చీలనే అంటిపెట్టుకున్నారు. తాము విభజనను అడ్డుకుని తీరుతామంటూ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు రాజీనామాలు చేసి వేరే పార్టీలలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో చర్చలు జరిపిన మంత్రి సారథి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, గన్నవరం మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆ పార్టీనే వీడారు. లగడపాటికి రాజకీయ సన్యాసం అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ పేరెత్తే నాథుడే లేకుండా పోయే పరిస్థితి దాపురించింది. -
'దేశంలోనే అత్యంత దౌర్భాగ్య నాయకుడు బాబు'
దేశంలో అత్యంత దౌర్భాగ్య నాయకుడు ఎవరైన ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేనని ప్రభుత్వ చీఫ్ వీప్ గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే విషయంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సోమవారం గండ్ర వెంకట రమణారెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలం అంటూ గతంలో బాబు లేఖ ఇచ్చిన సంగతిని గండ్ర ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కి మతిభ్రమించిందని గండ్ర ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు లోక్‌సభకు వచ్చిన సమయంలో లగడపాటి వ్యవహరించిన తీరు పట్ల గండ్ర ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను కలసి చంద్రబాబు ఆ విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోభాగంగా బీజేపీ అగ్రనేతలను బాబు కలసి సమావేశం కావడంపై గండ్ర మండిపడుతున్నారు. అలాగే లగడపాటి విభజన బిల్లును పార్లమెంట్లో అడ్డుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. ఆ దిశగా ఆయన గురువారం పార్లమెంట్లో వ్యవహరించిన తీరుపట్ల ఇప్పటికే సొంత పార్టీ నాయకులే కాకుండా వివిధ పార్టీల నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. -
మార్షల్ ఆధీనంలో లగడపాటి
న్యూఢిల్లీ: లోకసభలో 'లగడపాటి రాజగోపాల్' పెప్పర్ స్పే ఘటనలో గాయపడిన ముగ్గురు ఎంపీలకు చికిత్స అందిస్తున్నామని రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంసీ) ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముగ్గురు ఎంపీలను మాత్రమే ఆస్పత్రికి తీసుకువచ్చారు అని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో స్వల్ప అస్వస్థతకు గురైన మరికొంత మంది ఎంపీలకు పార్లమెంట్ ఆవరణలోనే వైద్యులు చికిత్స చేస్తున్నట్టు సమాచారం. పెప్పర్ స్పే చేసిన లగడపాటి రాజగోపాల్ భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఆరుగురు ఎంపీలలో లగడపాటి రాజగోపాల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. -
'సమైక్య ప్రకటన చేయాల్సిందే'
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలంటూ రాజకీయ పార్టీలన్నీ తక్షణం స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. ఇరు ప్రాంతాలకూ న్యాయం అనే కపట వైఖరిని విడనాడి, మారువేషాలు తొలగించుకుని.. ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులు సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామనే ప్రకటన చేయూలి. శాసనసభలో ఆ పార్టీల సభ్యులు తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ఈ తరహా వైఖరి తీసుకున్న పార్టీలకే తెలుగు ప్రజల మద్దతు ఉంటుంది..’’ అని తెలుగు ప్రజావేదిక స్పష్టం చేసింది. రాష్ట్ర సమైక్యత, తెలుగుజాతి అభ్యున్నతి కోరుతూ తెలుగు ప్రజావేదిక చైర్మన్ ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్కు వద్ద సామూహిక దీక్ష చేపట్టారు. వేదిక వైస్ చైర్మన్ డాక్టర్ పుచ్చలపల్లి మిత్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత వైఖరిని అవలంబిస్తూ అవకాశవాద రాజకీయాలను చేస్తున్న పార్టీలను అంతం చేయాలని, అలాంటి పార్టీల నేతలను శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న తెలుగు జాతి ద్రోహుల అవకాశవాద రాజకీయాలను ఓడించాలన్నారు. ఇప్పటివరకు ఒకటిగా ఉన్న తెలుగు వారిని విభజిస్తే ఇరు ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పారు. రాష్ట్ర విభజన అనివార్యమన్న లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విభజన ఎందుకు అవసరమో చెప్పాలన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ వంటి రాష్ట్రాలను విభజించడానికి సాహసించని నేతలు మన రాష్ట్రాన్నే ఎందుకు విభజించాల్సి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో ఎన్ని డివిజన్లు గెలుచుకుంటారో చెప్పాలని కేసీఆర్‌ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించి ఓడించాలని ఈ సందర్భంగా వేదిక తీర్మానం చేసింది. ఈ దీక్షలో తెలుగు ప్రజా వేదిక కన్వీనర్ డాక్టర్ జి. గంగాధర్, వివిధ జేఏసీల నాయకులు పాల్గొన్నారు. -
లగడపాటి చిందులు
సాక్షి, హైదరాబాద్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పత్రికల్లో రాయలేని భాషను ఉపయోగిస్తూ సాక్షి ప్రతినిధులను దూషించారు. మీదమీదకు వస్తూ వీధి రౌడీలా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఇతర పాత్రికేయులనూ వదల్లేదు. బూతు పంచాంగం వినిపించి సంస్కార హీనంగా ప్రవర్తించారు. లగడపాటి తిట్ల దండకం విన్న మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ అలా వ్యవహరించడం విజ్ఞత కాదని పదేపదే సర్దిచెప్పారు. అయినా వినకుండా లగడపాటి రెచ్చిపోయారు. రాయలేని భాషలో తిడుతూ ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ దూషణల పర్వం అందుకున్నారు. ప్రెస్‌మీట్‌కు పిలిచి మరీ అవమానించడంపై విలేకరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. లగడపాటి రాజగోపాల్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. దానికి హాజరు కావాలని కోరుతూ అన్ని మీడియా సంస్థలకు వచ్చినట్టుగానే ‘సాక్షి’కీ ఆహ్వానం వచ్చింది. దాంతో సాక్షి ప్రతినిధులు కూడా ఆ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. ప్రెస్‌మీట్‌ను ప్రారంభించిన లగడపాటి సమైక్య వాదం కోసం తాను చేస్తున్న కృషిని వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఇచ్చే శక్తి, ఆపే శక్తి లేదని ఆనాడు చెప్పిన జగన్‌కు ఈనాడెలా ఆపే శక్తి వచ్చిందంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు ఓట్లు, సీట్లే ముఖ్యమని, తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో జగన్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించే యత్నం చేస్తోందని ఆరోపించారు. జగన్‌కు 25 ఎంపీ సీట్లు...కేసీఆర్‌కు 15 ఎంపీ సీట్లు వస్తాయనే ఉద్దేశంతో వారితో కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కయ్యారని విమర్శించారు. నిజమైన సమైక్యవాది ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డేనంటూ కొనియాడారు. ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య బహిరంగ సభకు అన్ని చానళ్లు లైవ్ కవరేజీ ఇస్తే సాక్షి మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సాక్షి విపరీతమైన ప్రాధాన్యతనిస్తోందంటూ దుయ్యబట్టారు. ఆ సమయంలో సాక్షి విలేకరి ‘సార్...ఏపీఎన్జీవోల సభకు సాక్షి కూడా లైవ్ కవరేజీ ఇచ్చింది’ అని చెప్పబోతుండగా లగడపాటి ఒక్కసారిగా సాక్షి విలేకరులపై విరుచుకుపడ్డారు. ఆగ్రహంగా ‘నోర్మూయ్.. ఇది నా ప్రెస్‌మీట్. నువ్వు మాట్లాడొద్దు. నువ్వు సాక్షి అయితే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ మండిపడ్డారు. ‘అది కాదండీ....లైవ్ ఇచ్చామని చెప్పబోతున్నామే తప్ప అడ్డుకోవాలని కాదు’ అని చెప్పబోతుండగా.. ‘వెళ్లిపో.. ఇక్కడ కూర్చొని వెధవల్లా మాట్లాడొద్దు. ఏపీఎన్జీవోల సభను పట్టించుకోకుండా వెధవ పనులు చేసి ఇంత దాకా తీసుకొచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్తో లాలూచీ పడి రాష్ట్రాన్ని విభజిస్తున్నారు’ అంటూ తిట్ల దండకం అందుకున్నారు. అయినప్పటికీ సాక్షి విలేకరులు ప్రెస్మీట్లో లగడపాటి ప్రసంగం పూర్తయ్యే వరకు మౌనంగా ఉన్నారు. ‘ఇతర పార్టీలతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్‌లో మీరెందుకు కొనసాగుతున్నారు? మిమ్మల్నెందుకు పార్టీ విశ్వసించడం లేదని అడిగిన వేరే మీడియా ప్రతినిధులపై కూడా లగడపాటి అసహనం వ్యక్తం చేశారు. మీరే మీడియా సంస్థ నుంచి వచ్చారంటూ వారిని ప్రశ్నించారు. ‘వార్త నుంచి వచ్చాను. అయినా మీడియా గురించి ఎందుకు అడుగుతున్నార’ని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. ‘కాంగ్రెస్‌కు దత్త పుత్రుడు దొరికాడు. తేరగా 25 ఎంపీలు సీట్లు వస్తాయని కాంగ్రెస్ ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తోంది’ అని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ప్రెస్‌మీట్ ముగిసిన తరువాత, వెళ్లిపోయే ముందు.. మరోసారి సాక్షి విలేకరిపై చిందులేశారు. సాక్షి విలేకరులు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. మీరు పిలిస్తేనే వచ్చామని, పిలిచి అవమానించడం మర్యాద కాదని చెప్పిన విలేకరిపై మరింతగా రెచ్చిపోయారు. ‘ఎందీ మీకిచ్చే మర్యాద. ఇక్కడి నుంచి వెళ్లిపోండి. సాక్షిని బహిష్కరిస్తున్నా. సాక్షి వాళ్లెవరూ రావొద్దు’ అని మండిపడ్డారు. ఇతర విలేకరులు సర్దిచెబుతున్నా వినకుండా పూనకం వచ్చిన వ్యక్తిగా, వీధి రౌడీలా సాక్షి విలేకరులపై విరుచుకుపడ్డారు. లగడపాటి తీరును ప్రత్యక్షంగా చూసిన మీడియా ప్రతినిధులు ఆయన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. సీమాంధ్రలో ఉద్యమం తీవ్రం కావడం, అక్కడి ప్రజలంతా కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో.. దిక్కుతోచని స్థితిలో లగడపాటి సహనం కోల్పోయి, సాక్షిపై తన అక్కసును వెళ్లగక్కారని వారు అభిప్రాయపడ్డారు. లగడపాటి తీరును ఆద్యంతం గమనించిన విలేకరులు ఆయన వ్యక్తిగత ఎజెండాతోనే ప్రెస్‌మీట్‌కు వచ్చినట్లు కన్పించిందని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ఎదుగుదలను జీర్ణించుకోలేక పదేపదే అక్కసు వెళ్లగక్కుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుల మాదిరి గానే లగడపాటి వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొన్నారు. -
రాజీనామా ఆమోదించాలని స్పీకర్‌ను కోరాం
-
కాంగ్రెస్ కుదేల్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తానెక్కిన కొమ్మను తానే నరుక్కుంది. ఫలితంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ అధిష్టానం తీరు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి, పార్టీ రాజకీయ భవిష్యత్‌ను చేతులారా దెబ్బతీసిన కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలే తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన మాజీ మంత్రి, అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతల్లో తొలి రాజీనామా అస్త్రాన్ని బుద్ధప్రసాద్ సంధించారు. సోనియా తీరుపై ఆయన రాసిన బహిరంగ లేఖలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జిల్లా కాంగ్రెస్‌లో పెద్ద దిక్కుగా ఉన్న బుద్ధప్రసాద్ కాంగ్రెస్‌ను వీడటంతో మరికొందరు నేతలు ఆయన బాటలో పయనించే అవకాశం ఉందని అంటున్నారు. బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ శుక్రవారం అవనిగడ్డలో ముఖ్యనేతలు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించి రాజీనామా నిర్ణయం ప్రకటించారు. పలువురు తమ రాజీనామా లేఖలను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో డీసీపీ అధికార ప్రతినిధి రేమాల సుబ్బారావు (బెనర్జీ), డీసీసీ ఉపాధ్యక్షుడు మత్తి శ్రీనివాసరావు, కేడీసీసీ డెరైక్టర్ ముద్దినేని చంద్రరావు, మార్క్‌ఫెడ్ డెరైక్టర్ మోరాల సుబ్బారావు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లంకా కొండలు, అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, చల్లపల్లి మండలంలోని 60 మంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసి, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి అన్నే చిట్టిబాబు, డీసీసీ కార్యదర్శి చిరుమామిళ్ల రాజా, కాంగ్రెస్ పెనమలూరు మండల అధ్యక్షుడు చిగురుపాటి దామోదర్‌లు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మైలవరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోడా మల్లికార్జునరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ తీసుకున్న చర్యలను చూసి పది రోజుల క్రితం పీసీసీ సభ్యుడు, గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ నుగలాపు వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వారి బాటలో మరికొందరు నేతలు పయనించే అవకాశం ఉంది. లగడపాటి, సారథిపై విమర్శలు... జిల్లాకు చెందిన ఎంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రి కొలుసు పార్థసారథితో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 65 రోజులుగా ఉద్యమం సాగుతుంటే జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు ఢిల్లీ, హైదరాబాద్‌లో దాక్కున్నారని ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తాజాగా తెలంగాణ నోట్ వెలువడటంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను జిల్లాలో అడుగుపెట్టనిచ్చేదిలేదని సమైక్యవాదులు హెచ్చరిస్తున్నారు. విజయవాడ సిటీ కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి... జిల్లాలో కాంగ్రెస్‌కు చెడుకాలం దాపురించిన సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై విజయవాడ సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో కొందరు కార్యకర్తలు సమావేశం నిర్వహించాలన్న యోచనకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు బ్రేక్ వేసినట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ అంటే ప్రజలు ఆగ్రహంతో రగలిపోతున్నారని, కాంగ్రెస్ శ్రేణులు సమావేశాలు నిర్వహించడం సరికాదని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే వన్‌టౌన్‌లోని మరుపిళ్ల చిట్టి కార్యాలయానికి కార్యకర్తలు తాళాలు వేసి కాంగ్రెస్ బోర్డుపై వస్త్రాలు కట్టారు. కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుందని సమాచారం అందుకున్న ఏపీ ఎన్జీవోలు శుక్రవారం విజయవాడ సిటీ కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర విభజనకు తెగించిన కాంగ్రెస్ పార్టీపై ఏపీ ఎన్జీవోలు తీవ్రంగా విమర్శలు చేశారు. -
'రాష్ట్ర విభజనపై రాష్ట్రపతిని కలవాలి'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఈ మేరకు సీమాంధ్ర నేతలు ఏకం కావాలని ఆయన సూచించారు. తెలంగాణ నోట్ ను ఆమోదించడానికి రాష్ట్ర కాంగ్రెస్ లోని ముఖ్యనేతలే కారణమని లగడపాటి మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ మోజార్టీ ఎమ్మెల్యేలు విభజనకు అనుకూలంగా ఉన్నారంటూ ఓ ముఖ్యనేత కర్ణాటకలోని మ్యాండ్యాకు వెళ్లి మరీ నివేదిక ఇచ్చారని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఆగమేఘాలపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలే కారణమన్నారు. కచ్చితంగా రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో కేసువేయాలన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఇందుకు సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారంటూ రాష్ట్రపతిని కలవాల్సిన అవసరం ఉందన్నారు. సమాఖ్య సూత్రాలను, రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించేలా ఈ చర్య ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నపారని, దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే అది తప్పనిసరిగా వీగిపోతుందని రాజగోపాల్ అన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. -
తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ నాయకులతోపాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్ర పోలీసుల్లో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్‌లో సాయుధ బలగాల తిరుగుబాటును ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారని సీమాంధ్రకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రాంతీయతత్వాన్ని, తిరుగుబాటును రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నుండి 14ఎఫ్ తొలగించడంతో ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులలో 1973 నాటి షట్సూత్ర పథకాన్ని, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాంతాలవారీగా పోలీసుల్లో తిరుగుబాటును రెచ్చగొట్టే ప్రయత్నాలు అత్యంత తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీయవచ్చునని ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, డాక్టర్ కె.వి.పి.రామచంద్రరావు, ఎ.సాయిప్రతాప్‌లు లేఖలో హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహించిన బహిరంగసభను అడ్డుకొనేందుకు అన్ని విధాలా ప్రయత్నించిన వేర్పాటువాదులు... ఉద్యోగులు రాజధానికి వస్తున్నప్పుడు, తిరిగి వెళ్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న బస్సులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. శనివారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ సభాస్థలికి సమీపంలోని అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రజలు సభకు హాజరవకుండా భయపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బహిరంగసభ జరిగిన ఎల్బీ స్టేడియం బయట విధులు నిర్వహించాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ లోనికి చొరబడి వేదిక సమీపంలో జై తెలంగాణ నినాదాలు చేయడం ద్వారా ప్రశాంతంగా జరుగుతున్న సభను చెడగొట్టే ప్రయత్నం చేశాడని దిగ్విజయ్ దృష్టికి తెచ్చారు. ఈ కానిస్టేబుల్ ప్రవర్తనను కొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా సమర్థించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రం విడిపోకముందే సీమాంధ్రుల పరిస్థితి ఇలా ఉంటే విభజన తర్వాత ప్రజల ప్రజాస్వామిక హక్కు అయిన భావప్రకటనా స్వేచ్ఛ పరిస్థితి ఎంత అధ్వానంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చునని వారు పేర్కొన్నారు.