సిద్దిపేటఅర్బన్, న్యూస్‌లైన్: సీమాం ధ్రలో వైఎస్సార్ సీపీ హవా చూసి కంగుతింటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లగడపాటి రాజగోపాల్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్‌సీపీ సిద్దిపేట అసెంబ్లీ అభ్యర్థి తడ్క జగదీశ్వర్‌గుప్తా పేర్కొన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటికి వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.
ప్రజల్ని ఆయోమయానికి గురిచేస్తున్న లగడపాటి సర్వేలను జనం నమ్మరన్నారు.సర్వేలు చేయించి జనం మనవైపే ఉన్నారంటూ నమ్మించి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టించి కిరణ్‌కుమార్‌రెడ్డికి వెన్నుపోటు పొడిచిన ఘనత లగడపాటికే దక్కిందన్నారు. లగడపాటి మాటల్ని ప్రజలు పట్టించుకోరన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాలుకల ధోరణితో ప్రజలను వంచిస్తూ దగాచేస్తున్న చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞానులుగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీమాంధ్రలో జగన్‌ను అధికారంలోకి రాకుండా ఏ శక్తీ అడ్డుకొలేరన్నారు.సమావేశంలో పార్టీ నాయకులు అఖిల్, విజయ్, ప్రవీణ్, నారాయణ, రాజశేఖర్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
లగడపాటి సర్వేలను జనం నమ్మరు
Published Mon, May 5 2014 12:01 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement