ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆపార్టీ అధికార ప్రతినిధి ఓవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే విజయమని సర్వేలు చెబుతున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని జాతీయ ఛానెళ్లు, జాతీయ దినపత్రికలు వెల్లడిస్తున్నాయన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఓవీ రమణ మండిపడ్డారు. చిల్లర దందాలు, బెట్టింగ్ల కోసమే లగడపాటి సర్వే అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు.
Published Thu, May 15 2014 2:50 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
Advertisement