OV Ramana
-
'బీజేపీ జై శ్రీరాం కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి'
సాక్షి, తిరుపతి: రామతీర్థం ఘటనపై టీడీపీ, బీజేపీ నాయకులు రాజకీయ క్రీడ ఆడుతున్నారని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ మండిపడ్డారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ తరపున మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని రాజకీయ పార్టీలు చెప్పడం రాజకీయ కుట్రే. గతంలో చంద్రబాబునాయుడు దేవాలయాలను కూల్చివేస్తే హిందూ ధర్మం అని ఆనాడు టీడీపీ నాయకులు పేర్కొన్నారని తెలిపారు. చదవండి: (మత విద్వేషాలకు భారీ కుట్ర) రాజకీయ పార్టీలు నేడు వాటి అవసరాల కోసం, స్వార్థం కోసం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ తీరు ఎలా ఉందంటే ఏడు కొండలు కావాలా, రెండు కొండలు కావాలా, భగవద్గీత కావాలా, బైబిల్ కావాలా అనడం మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కుల, మతాలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికలు అయిపోగానే సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ, బీజేపీ పార్టీలు జైశ్రీరాం అనడం సరికాదన్నారు. బీజేపీ ఉపఎన్నికల్లో లబ్ధి కోసమే హిందూ దేవాలయాలను అడ్డుపెట్టుకొని హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ జై శ్రీరాం అని కాకుండా ప్రజలకు మేము ఈ సంక్షేమ పథకాలు తెచ్చాం, అభివృద్ధి చేశామని చెప్పలేదు. వారు ఏనాడు అభివృద్ధి పనులను చేసింది లేదన్నారు. టీడీపీ, బీజేపీ వైఖరిపై ప్రతి హిందువు కూడా మిమ్మల్ని ఛీత్కరించే రోజు వచ్చిందన్నారు. చదవండి: (చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు) -
తిరుమలలో వేయి కాళ్ల మండపాన్ని కూల్చింది చంద్రబాబే..
సాక్షి, తిరుపతి: ‘తిరుమలలోని అతి పురాతన కట్టడం వేయి కాళ్ల మండపాన్ని చంద్రబాబు హయాంలోనే కూలదోయించారు.. కొన్ని రోజుల పాటు కూల్చే కార్యక్రమాన్ని చేపట్టినా.. మఠాధిపతులు, పీఠాధిపతులు, బీజేపీ నాయకులు ఏం చేశారు? అని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ ప్రశ్నించారు. తిరుమల ఆలయంలోనే నిత్యం నిర్వహించే కల్యాణోత్సవ కార్యక్రమాన్ని బయట చేయాలని ఆదేశాలిచ్చింది చంద్రబాబేనన్నారు. ఆలయాల పేరుతో చంద్రబాబు, బీజేపీ శ్రేణులు చేస్తున్న విష ప్రచారంపై ఆయన స్పందించారు. ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. శ్రీవారిని అడ్డుపెట్టుకునే చంద్రబాబు రాజకీయ అరంగేట్రం చేశారని గుర్తుచేశారు. నాడు సంజయ్‌గాం«దీకి శ్రీవారి దర్శనం చేయించి ఆయన్ను ప్రసన్నం చేసుకుని కాంగ్రెస్ టికెట్ పొందినట్టు తెలిపారు. తిరుమలలోని గొల్లమండపాన్ని కూడా కూలదోయించేందుకు యత్నించారని, ఆ సమయంలో యాదవుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు చెప్పారు. ఇంకా మహాప్రాకారం పేరుతో కళ్యాణకట్ట, పుష్కరిణిని ఓకేచోట కలపాలని చూసిన వ్యక్తి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. కృష్ణాపుష్కరాల సమయంలో ఆలయాలను చంద్రబాబు కూల్చలేదా? అని ఓవీ రమణ ప్రశ్నించారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి, లేదా పవిత్ర కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో చంద్రబాబు బూట్లు వేసుకునే పూజలు చేస్తారని, అటువంటి వ్యక్తికి ఆలయాలు, వాటి పవిత్రత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు అయినప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయని ఆరోపించారు. పీఠాధిపతులు, మఠాధిపతులు రాజకీయాలు చేయడం అన్యాయమన్నారు. సంప్రదాయాలు, ఆలయాల పవిత్రతను కాపాడలనుకునే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని, ఏదన్నా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన పాటించే నియమాలే ఇందుకు నిదర్శనమని ఓవీ రమణ స్పష్టం చేశారు. -
రాజకీయ పక్షాల విమర్శలు బాధాకరం
-
ఎక్కడా లేని అభ్యంతరం.. అక్కడే ఎందుకు?
సాక్షి, తిరుపతి: తిరుమల డిక్లరేషన్‌పై కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలు బాధాకరమని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఓవీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైకుంఠం ముందు ఒక నోటీసు బోర్డు ఉంది. అందులో డిక్లరేషన్ ఇవ్వాలా? వద్దా అన్నది భక్తుల ఇష్టం’’ అని పేర్కొన్నారు. దీనిపై అనవసర రాజకీయం చేస్తున్నారన్నారు. దేశంలో ఏ ఆలయంలో కూడా డిక్లరేషన్ లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని ఆలయాలకు అన్ని మతాల వారు వెళ్తుతున్నారని, ఎక్కడా లేని అభ్యంతరం తిరుమలకు ఎందుకు అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని మీద కొందరు విమర్శలు చేయడం పట్ల ఆయన తప్పుపట్టారు. ఆచార వ్యవహారాలపై పీఠాధిపతులు ఎందుకు మాట్లాడటం లేదని ఓవీ రమణ నిలదీశారు. తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు: చెన్నై నుంచి ఊరేగింపుగా హిందూ ధర్మర్ధ సమితి సంస్థ ఆధ్వర్యంలో తిరుమలకు గొడుగులు చేరుకున్నాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డిలకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ జి. గోపాల్ గొడుగులను అందజేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి గొడుగులను అలంకరించనున్నారు. మొత్తం 11 గొడుగులను కానుకగా అందించగా, 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, 2 గొడుగులు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి టీటీడీ వినియోగించనుంది. -
వెలగపూడి గోపాలకృష్ణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు నేతలపై బీజేపీ సస్పెన్షన్ వేటు వేయగా తాజాగా మరో నేత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఏపీ బీజేపీ యూనిట్ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు ఈ మేరకు ఏపీ బీజేపీ ఆదివారం ఓ లేఖను విడుదల చేసింది. వెలగపూడి గోపాలకృష్ణ వ్యాఖ్యలు పార్టీ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సదరు లేఖలో పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. (డాక్టర్ ఓవీ రమణపై బీజేపీ సస్పెన్షన్ వేటు) -
డాక్టర్ ఓవీ రమణపై బీజేపీ సస్పెన్షన్ వేటు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. రమణ తీరును రాష్ట్ర బీజేపీ యూనిట్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. ఈమేరకు ఏపీ బీజేపీ కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు ఓవీ రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా, మూడు ముక్కలాటతో నష్టపోతున్న బీజేపీ అంటూ పార్టీ లైన్‌కు విరుద్ధంగా ఓవీ రమణ రెండు రోజుల క్రితం ఓ తెలుగు దినపత్రికలో వ్యాసం రాశారు. ‘మొన్నటి దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని దీక్షలు చేశారు. మీడియా సమావేశాలు పెట్టి ఒకటికి పదిసార్లు ప్రకటించారు. ఇప్పుడేమో రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరని సరికొత్త ప్రవచనాలు వల్లిస్తున్నారు. దీంతో, బీజేపీపైన ప్రజల్లో ఉన్న నమ్మకం ఒక్కసారిగా క్రిందికి జారిపోయింది. నిన్న ఏపీ బీజేపీ నూతన అధ్య క్షుడు ఢిల్లీలో మాట్లాడుతూ, ‘అమరావతి రైతులకు అండగా ఉంటాం, రాజధాని విషయం మాత్రం రాష్ట్రం నిర్ణయమే’ అని చెప్పడం విచిత్రంగా ఉంది. రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినపుడు ఇక మద్దతు దేనికిస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడుకున్న బీజేపీ ఔన్నత్యాన్నే శంకించే పరిస్థితి ఏర్పడింది’అని ఓ.వీ రమణ ఆంధ్రప్రదేశ్ బీజేపీని సూటిగా ప్రశ్నించారు. (వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ ) -
టీటీడీలో ప్రొటోకాల్ వివాదం
సాక్షి, చిత్తూరు: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చిన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి అవమానం జరిగిందని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవీ రమణ మండిపడగా.. ఆయనకు తాజాగా టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు లీగల్ నోటీసులు పంపించారు. ఈ వ్యవహారంలో ఓవీ రమణ తనను అవమానించారంటూ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన ఓవీ రమణ.. మీడియా సమక్షంలో క్షమాపణలు చెప్పారు. అయితే, దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమార స్వామికి జరిగిన అవమానంపై ఎవరు సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం ఏపీ సర్కార్‌కు లేఖ రాస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వారంలోపు టీటీడీ స్పందించకుంటే జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. తిరుమలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయని ఓవీ రమణ ఆరోపించారు. -
తిరుపతి టికెట్.. రంగంలోకి కుమారస్వామి
తిరుపతి తుడా: కర్ణాటక జేడీఎస్‌తో సత్సంబంధాల నేపథ్యం తిరుపతి టీడీపీలో చిచ్చు రేపింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ కర్ణాటక సీఎంను రంగంలోకి దించుతున్నట్లు భోగట్టా. జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, కన్నడ ముఖ్యమంత్రి కుమార స్వామి తిరుపతి అసెంబ్లీ టికెట్ రమణకు ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. దీంతో టీడీపీలోని ఆశావహుల్లో గుబులు మొదలైంది. పార్టీ అధిష్టానంపై వీరంతా గుర్రుగా ఉన్నారు. జేడీఎస్ ప్రతిపాదనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తిరుపతి టీడీపీలో ఇప్పటికే నాలుగు గ్రూపులున్నాయి. వీరంతా ఎవరికి వారే టికెట్టు తమకంటే తమకు అని ప్రచారం చేసుకుంటున్నారు. పరస్పరం బురదజల్లుకుంటూ ఫిర్యాదులు చేసుకుంటుండడంతో అధిష్టానం తల పట్టుకుంటోంది. జేడీఎస్ తరఫున ఓవీ రమణను టీడీపీలో చేర్చుకుంటే తామంతా మూకుమ్మడిగా పార్టీకి దూరంగా ఉంటామని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. రమణపై టీడీపీలోని రెండు వర్గాలు అధినేతకు ఫిర్యాదులు చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తిరుపతికి ఆయన చేసిందేమీ ఏమీ లేదని ఎమ్మెల్యే వర్గంతో పాటు ఇటీవల గల్లా అరుణకుమారి అండతో తిరుపతి అసెంబ్లీ టికెట్టు తనదేనని ప్రచారం చేసుకుంటున్న ఓ నేత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పార్టీలో చేరితే తమ సంగతేంటని నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారు పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వ్యతిరేకిస్తున్న ఆశావహులు.. సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ మరోసారి టికెట్టును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మంత్రి నారాయణ ద్వారా రాజకీయం నడుపుతున్నారు. పార్టీ అధిష్టానంతో తనకున్న సన్నిహిత సంబంధాల రీత్యా తుడా చైర్మన్ ఎమ్మెల్యే సీటుకు తన పేరును ప్రకటిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీకి సుముఖత వ్యక్తం చేయడంలేదని తెలుస్తోంది. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అండతో తిరుపతిలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న ఓ నేత సామాజిక ప్రతిపాదికన తనకే సీటు దక్కుతుందని ప్రకటించుకున్నారు. మరోవైపు ఓ మాజీ ఎమ్మెల్యే కూడా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా వీరు నాలుగు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలకు దూరంగా, ఫిర్యాదులతో బిజీగా ఉన్నారు. ఓవీ రమణ విషయంలో చంద్రబాబునాయుడు తీరుతో ఇప్పటికే ఆ పార్టీకి కొన్ని బలమైన సామాజిక వర్గాలు దూరమవ్వడంతో టికెట్టును ఆశించిన ఇద్దరు వెనుకడుగేసినట్లు తెలుస్తోంది. తిరుపతిలో టీడీపీ గెలవడం అంత సులభం కాదని కొందరు ఆశావహులు ఇప్పటికే గుర్తించారు. విపక్షం వైఎస్సార్సీపీ వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతూ పలు సామాజిక వర్గాలకు మరింత సన్ని హితం కావడం వీరి ఆశలపై నీళ్లు చల్లుతోంది. దీంతో మేయర్ గానీ, నామినేటెడ్ పదవి ఇస్తే చాలని ఇద్దరు ఆశావహులు పార్టీలోని సీనియర్ల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుటుంబ సమేతంగా ఈనెల 13, 14 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన నేప«థ్యంలో టీడీపీలో చేర్చుతున్నట్టు కుమారస్వామి చేత ప్రకటించుకునేలా రమణ పావులు కదుపుతున్నారు. ఆ మేరకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. -
బలిజలను తక్షణమే బీసీ జాబితాలో చేర్చాలి
-
'ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీదే విజయం'
-
'ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సీపీదే విజయం'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ఆపార్టీ అధికార ప్రతినిధి ఓవీ రమణ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే విజయమని సర్వేలు చెబుతున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగనేనని జాతీయ ఛానెళ్లు, జాతీయ దినపత్రికలు వెల్లడిస్తున్నాయన్నారు. లగడపాటి రాజగోపాల్ సర్వేల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఓవీ రమణ మండిపడ్డారు. చిల్లర దందాలు, బెట్టింగ్‌ల కోసమే లగడపాటి సర్వే అంటూ ఊదరగొడుతున్నారని అన్నారు. -
లోకేష్ కు స్టాన్ఫోర్డ్ వర్సిటీ పట్టా ఎలా ఇచ్చిందో?
హైదరాబాద్: వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని వైఎస్ఆర్సీపీ నేత భవనం భూషణ్ అన్నారు. గత ఎన్నికలప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన నగదు బదిలీ పథకం గురించి గొప్పగా చెప్పుకున్నారని, మరి ఈసారి మేనిఫెస్టోలో అది ఎందుకు లేదని ప్రశ్నించారు. లోకేష్ కు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పట్టా ఎలా ఇచ్చిందో అర్ధం కావడంలేదన్నారు. అత్తెసరు మార్కులతో పాసైన లోకేష్ కు స్టాన్ఫోర్డ్ యూనిర్సిటీలో సీటు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీలో లోకేష్ కు ఫీజు ఎవరు కట్టారని అడిగారు. రామోజీ రావు పత్రికా విలువలు దిగజార్చి అడ్డగోలు కథనాలు రాస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత ఓవీ రమణ అన్నారు. రామోజీ మీపై ఉన్న కేసుల గురించి ఎందుకు రాసుకోవడం లేదని ప్రశ్నించారు. జర్నలిజం విలువలు కాపాడాలని సూచించారు.