లోకేష్ కు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ పట్టా ఎలా ఇచ్చిందో?
హైదరాబాద్: వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని వైఎస్‌ఆర్‌సీపీ నేత భవనం భూషణ్ అన్నారు. గత ఎన్నికలప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన నగదు బదిలీ పథకం గురించి గొప్పగా చెప్పుకున్నారని, మరి ఈసారి మేనిఫెస్టోలో అది ఎందుకు లేదని ప్రశ్నించారు. లోకేష్ కు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పట్టా ఎలా ఇచ్చిందో అర్ధం కావడంలేదన్నారు. అత్తెసరు మార్కులతో పాసైన లోకేష్ కు స్టాన్‌ఫోర్డ్ యూనిర్సిటీలో సీటు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. స్టాన్‌ఫోర్ట్ యూనివర్సిటీలో లోకేష్ కు ఫీజు ఎవరు కట్టారని అడిగారు.
రామోజీ రావు పత్రికా విలువలు దిగజార్చి అడ్డగోలు కథనాలు రాస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత ఓవీ రమణ అన్నారు. రామోజీ మీపై ఉన్న కేసుల గురించి ఎందుకు రాసుకోవడం లేదని ప్రశ్నించారు. జర్నలిజం విలువలు కాపాడాలని సూచించారు.