బత్తిలి(భామిని), న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ఎన్నికల ప్రచారానికి స్పందన కరువైంది. ఆయన ప్రసంగం చప్పగా సాగటంతో జనం విసిగిపోయారు. భామిని మండలం బత్తిలిలో గురువారం లోకేష్ రోడ్‌షో నిర్వహించారు. జనం రాకపోవటంతో స్థానిక నేతలు అప్పటికప్పుడు వాహనాల్లో కొంతమందిని తీసుకొచ్చారు. జనం లేరని తెలుసుకున్న లోకేష్ గంటల తరబడి ఆలస్యం చేసి మరీ వచ్చారు. పార్టీ కార్యకర్తలు మద్యం దుకాణానికి వెళ్లేందుకే ఆసక్తి చూపారు.
వంశధార భూములు వెనక్కి ఇప్పిస్తా
రోడ్‌షోలో లోకేష్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే.. వంశధార ప్రాజె క్టు పేరిట గతంలో ప్రభుత్వం అక్రమంగా తీసుకున్న భూములను వెనక్కి తీసుకుని యజమానులకు ఇస్తామన్నారు. ఇదెలా సాధ్యమో అర్థం కాక స్థానికులు తలలు పట్టుకున్నారు. ఎన్‌టీఆర్ పేరు చెప్పినప్పుడు స్పందించిన జనం.. చంద్రబాబు పేరెత్తినప్పుడు మాత్రం పెదవి విరిచారు.
లోకేష్ ప్రచారానికి స్పందన కరువు
Published Fri, May 2 2014 1:47 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement