
సాక్షి, తిరుపతి: తిరుమల డిక్లరేషన్‌పై కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న విమర్శలు బాధాకరమని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఓవీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైకుంఠం ముందు ఒక నోటీసు బోర్డు ఉంది. అందులో డిక్లరేషన్ ఇవ్వాలా? వద్దా అన్నది భక్తుల ఇష్టం’’ అని పేర్కొన్నారు. దీనిపై అనవసర రాజకీయం చేస్తున్నారన్నారు. దేశంలో ఏ ఆలయంలో కూడా డిక్లరేషన్ లేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని ఆలయాలకు అన్ని మతాల వారు వెళ్తుతున్నారని, ఎక్కడా లేని అభ్యంతరం తిరుమలకు ఎందుకు అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని మీద కొందరు విమర్శలు చేయడం పట్ల ఆయన తప్పుపట్టారు. ఆచార వ్యవహారాలపై పీఠాధిపతులు ఎందుకు మాట్లాడటం లేదని ఓవీ రమణ నిలదీశారు.
తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు:
చెన్నై నుంచి ఊరేగింపుగా హిందూ ధర్మర్ధ సమితి సంస్థ ఆధ్వర్యంలో తిరుమలకు గొడుగులు చేరుకున్నాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మా రెడ్డిలకు హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ జి. గోపాల్ గొడుగులను అందజేశారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు స్వామివారికి గొడుగులను అలంకరించనున్నారు. మొత్తం 11 గొడుగులను కానుకగా అందించగా, 9 గొడుగులను తిరుమల శ్రీవారి ఆలయానికి, 2 గొడుగులు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి టీటీడీ వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment