సుప్రీం స్టే విధిస్తే.. రాజకీయాల్లో కొనసాగుతా: లగడపాటి
కృష్ణా: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టే వస్తే రాజకీయాల్లో కొనసాగుతానని విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉభయ సభలు ఆమోదం తెలుపడంతో లగడపాటి రాజకీయాల్లోంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
లగడపాటి తీసుకున్న నిర్ణయానికి మార్చుకుని..రాజకీయాల్లో కొనసాగాలని ఆయన అనుచరుడు ఆంద్రీయ దీక్షను చేపట్టారు. ఆంద్రీయ దీక్షను లగడపాటి విరమింప చేశారు. ఆ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ.. రాష్ట్రం సమైక్యంగా ఉంటే తాను రాజకీయాల్లో కొనసాగుతానని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయాల్లోంచి తప్పుకుంటానని లగడపాటి వెల్లడించిన విషయం తెలిసిందే.