
చంద్రబాబుతో లగడపాటి రాజగోపాల్ భేటీ
న్యూఢిల్లీ : రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ బాకాలు ఊదిన విజయవాడ లోక్సభ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన ఆయన ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు పావులు కదుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆయన గురువారం కలిశారు. త్వరలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.