బాబు ఒత్తిడితోనే ‘సర్వే’ మార్చారు | KCR Fires On Lagadapati Rajagopal Election Survey | Sakshi
Sakshi News home page

లగడపాటి సర్వేపై కేటీఆర్‌ ట్వీట్‌

Published Tue, Dec 4 2018 11:47 PM | Last Updated on Wed, Dec 5 2018 4:16 PM

KCR Fires On Lagadapati Rajagopal Election Survey - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే లగడపాటి రాజగోపాల్‌ తన సర్వే ఫలితాన్ని మార్చారని కేటీఆర్‌ ఆరోపించారు. లగడపాటి సర్వేను ఆయన తప్పుపట్టారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి 65–70 సీట్లు వస్తాయంటూ గత నెల 20న లగడపాటి తనకు పంపిన మెసేజ్‌ను ఆయన మంగళవారం ట్విట్టర్‌లో బయటపెట్టారు. సర్వే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను బయటపెట్టేందుకే తాను ఆ మెసేజ్‌ను షేర్‌ చేయాల్సి వచ్చిందని చెప్పారు.

అయితే నవంబర్‌ 20 నాటికి ఉన్న పరిస్థితిని బట్టి ఆ ఫలితాలు చెప్పానని, కేసీఆర్‌ వ్యూహాలపై తనకు పూర్తి అవగాహన ఉన్నదని చెప్పిన లగడపాటి.. తన అంచనాలను మించి టీఆర్‌ఎస్‌ సీట్లు సాధించినా ఆశ్చర్యం లేదని అన్నారని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ విషయం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ నిరూపితమైందని లగడపాటి కేటీఆర్‌కు పంపిన మెసేజ్‌లో తెలిపారు. (కూటమికి అనుకూలంగా లగడపాటి జోస్యం)

లగడపాటిది సర్వే కాదని, చిలక జోస్యమని ఆయన ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో గందరగోళం సృష్టించే లాస్ట్‌ మినట్‌ ప్రయత్నమన్నారు. లగడపాటి, చంద్రబాబు పొలిటికల్‌ టూరిస్టులని చెప్పారు. డిసెంబర్‌ 11న తట్టాబుట్టా సర్దేస్తారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement