
'అవసరమైనప్పుడు చివరి బ్రహ్మస్త్రం'
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపేందుకు తమవద్ద బ్రహ్మాస్త్రాలు చాలా ఉన్నాయని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపేందుకు తమవద్ద బ్రహ్మాస్త్రాలు చాలా ఉన్నాయని విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి వ్యాఖ్యానించారు. అవసరం అయినప్పుడు చివరి బ్రహ్మస్తాన్ని వాడతామని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన జరగదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అసలు బిల్లును పంపకుండా నకిలీ బిల్లును అసెంబ్లీకి పంపారని లగడపాటి ఆరోపించారు. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లు పార్లమెంట్లో చర్చకు రాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రాన్ని విభజించవద్దని కోరతామని లగడపాటి తెలిపారు.