
విభజన అనివార్యమనే భావన సరికాదు: లగడపాటి
రాష్ట్ర విభజన అనివార్యమని కొందరు నేతలు పేర్కొంటున్నారని, ఆ భావన సరైనది కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన అనివార్యమని కొందరు నేతలు పేర్కొంటున్నారని, ఆ భావన సరైనది కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలో లగడపాటి మాట్లాడుతూ... పార్టీల తీర్మానం మేరకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు. హైదరాబాద్ను కేంద్రంపాలిత ప్రాంతం చేస్తే విభజనకు అంగీకరిస్తామని కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ పార్లమెంట్ శీతాకాలం సమావేశాల్లో తెలంగాణ బిల్లు వచ్చే అవకాశం లేదని తెలిపారు. నేడు జరగనున్న కేంద్రం మంత్రుల బృందం సమావేశంలో ఏమీ తేలదని భావిస్తున్నట్లు లగడపాటి చెప్పారు. విభజన అంశం రాత్రికి రాత్రే తేలేది కాదని లగడపాటి వెల్లడించారు.