జేసీ కాలం చెల్లిన మెడిసిన్: మధు యాష్కీ
జేసీ కాలం చెల్లిన మెడిసిన్: మధు యాష్కీ
Published Mon, Jan 27 2014 10:02 PM | Last Updated on Thu, Aug 16 2018 5:07 PM
న్యూఢిల్లీ: సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నేతలపై నిజమాబాద్ ఎంపీ మధుయాష్కీ భగ్గుమన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి లాంటివారు కాలం చెల్లిన (ఎక్స్ పైరీ) మెడిసిన్ లాంటివారు అని యాష్కీ వ్యాఖ్యానించారు.
ఇక అధిష్టానం చుట్టూ తిరిగినా రాజ్యసభ టికెట్ రాకపోవడంతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ లాంటివాళ్లు కాంగ్రెస్ పనైపోయిందని అనడంపై ఆయన తప్పుపట్టారు. జేసీ, లగడపాటిలాంటి వారు కాంగ్రెస్‌ను ఏమీ చేయలేరు అని ఆయన అన్నారు.
జేసీ నమ్మి టికెట్ ఇస్తే ట్రావెల్స్ పెట్టి ప్రజల ప్రాణం తీస్తున్నారు అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. సమైక్యం కోసం రాజీనామా చేశామని చెప్పుకుంటున్న నేతలు రాజ్యసభ సీట్లు ఎందుకు అడుగుతున్నారో సీమాంధ్ర ప్రజలు గమనించాలి ఎంపీ మధుయాష్కీ అన్నారు.
Advertisement
Advertisement