rajyasabha polls
-
ఆదాల నామినేషన్ మద్దతు లొల్లి
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ముందు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు తర్వాత వాటిని ఉపసంహరించుకోవడం వివాదానికి దారితీసింది. ముందు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉపసంహరణ లేఖలు ఇస్తే ఎలాగని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఉపసంహరణ లేఖలను అంగీకరిస్తే.. తనకు మద్దతుగా మరో పది లేఖలను ఇప్పటికిప్పుడు తెస్తానని, మరి వాటిని కూడా అంగీకరిస్తారా అని అడిగినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై ఇంకా అసెంబ్లీ వర్గాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, అక్కడే పరిష్కరించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
సమైక్యవాదులు కాకపోతే ఎమ్మెల్యేలే ఓడిస్తారు
రాజ్యసభ ఎన్నికలకు వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించిన అభ్యర్థులు సమైక్యవాదులు కాకపోతే.. వారిని ఆ పార్టీల ఎమ్మెల్యేలే ఓడిస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతిని ఎవరూ విడదీయలేరని, తనకు రాజకీయం కంటే రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని రాజగోపాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అన్ని క్లాజులపై ఓటింగ్ పెట్టి సభలో బిల్లును ఓడిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
రాజ్యసభ అభ్యర్థి మార్పు, పార్టీ నుంచి బహిష్కరణ
రాజ్యసభ ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన అభ్యర్థులలో ఒకరిని తప్పించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. ఆ తీసేసిన అభ్యర్థిని పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. అతడి స్థానంలో వేరే అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. ఎన్.చిన్నదురై పార్టీ నిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తుండగా, ఆయనను రాజ్యసభ సభ్యత్వానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే.. ఆ తర్వాత చిన్నదురై పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలియడంతో ఆయనను తప్పించి, ఆ స్థానంలో ఏకే సెల్వరాజ్‌ను ఆ స్థానంలో అభ్యర్థిగా ప్రకటించారు. చిన్నదురై పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని కూడా ఆమె అన్నారు. ఫిబ్రవరి ఏడో తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థి టీకే రంగరాజన్‌కు కూడా అన్నాడీఎంకే మద్దతు ఇస్తోంది.