రాజ్యసభ ఎన్నికలకు ముందుగా నిర్ణయించిన అభ్యర్థులలో ఒకరిని తప్పించిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత.. ఆ తీసేసిన అభ్యర్థిని పార్టీ నుంచి కూడా బహిష్కరించారు. అతడి స్థానంలో వేరే అభ్యర్థిని కూడా ప్రకటించేశారు. ఎన్.చిన్నదురై పార్టీ నిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తుండగా, ఆయనను రాజ్యసభ సభ్యత్వానికి అభ్యర్థిగా ఎంపిక చేశారు.
అయితే.. ఆ తర్వాత చిన్నదురై పార్టీ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలియడంతో ఆయనను తప్పించి, ఆ స్థానంలో ఏకే సెల్వరాజ్ను ఆ స్థానంలో అభ్యర్థిగా ప్రకటించారు. చిన్నదురై పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని కూడా ఆమె అన్నారు. ఫిబ్రవరి ఏడో తేదీన జరిగే రాజ్యసభ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థి టీకే రంగరాజన్కు కూడా అన్నాడీఎంకే మద్దతు ఇస్తోంది.
రాజ్యసభ అభ్యర్థి మార్పు, పార్టీ నుంచి బహిష్కరణ
Published Sat, Jan 25 2014 12:49 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement
Advertisement