పదవుల మేళా
Published Tue, Mar 11 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM
స్వల్ప వ్యవధిలోనే ఐదు ఎన్నికలు
రాజకీయ నిరుద్యోగులకు పండగ
ఏ పదవులకైనా సై అంటున్న నేతలు
ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్న పార్టీలు
కొత్తవాళ్లతో నిండిపోతున్న వైనం
సాక్షి, ఏలూరు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఎన్నికలన్నీ ఒకేసారి రానే వచ్చేశాయి. రాజకీయ నిరుద్యోగుల నెత్తిన పాలుపోశాయి. ఈసారి ఏదో ఓ పదవి తప్పక వరిస్తుందని గంపెడాశలు పెట్టుకున్న నేతలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఎలాగైనా టికెట్ సంపాదించాలని వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. ఆశావహులకు సీట్లు సర్దుబాటు చేయడంలో అధినాయకులు తల మునకలయ్యారు. రాజకీయం అనే రొంపిలోకి వెళ్లకూడదనే అపోహల నుంచి బయటపడి కొత్తవారు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.
కొందరికి చావోరేవో!
ఎన్నికల్లో ఏదో ఓ పదవి సంపాదించకపోతే ఈసారి కొందరికి రాజ కీయ భవిష్యత్ ఉండని పరిస్థితి. వారిలో గల్లీ నాయకుడి నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్య మం కారణంగా కొందరికి రాజకీయ భవిష్యత్ లేకుండా పోయే ప్రమా దం ఏర్పడింది. ఈ కోవకు చెందినవారే జిల్లాకు చెందిన ఓ కేంద్రమంత్రి. సమైక్యాంధ్ర నినాదంతో పదవిని చేపట్టి అనంతరం అధిష్టానానికి జై కొట్టడంతో అతనిపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఈ ఎన్నికలు ఆయనకు చావోరేవోగా మారాయి. అలాగే జిల్లాకు చెందిన మరో మంత్రికీ ఇవి చివరి ఎన్నికలు కానున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధికార చెలాయించిన పార్టీ లో ఉన్న ఈ నేతా ప్రజాగ్రహాన్ని చవిచూడనున్నారు.
స్థానిక సమరంపై దృష్టి
మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో కొందరు మునిసిపల్ చైర్మన్ జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించారు. తమ అనుయాయులకు టికెట్ ఇప్పించేందుకు పార్టీల అధిష్టానాల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీలు కూడా టికెట్ పంపకాల్లో సమస్యలు తలెత్తకుండా ఆశావహులకు ఆఫర్లు ఇస్తున్నాయి. అసెంబ్లీ టికెట్ కుదరకపోతే మునిసిపల్ చైర్మన్, అదీ కుదరకపోతే జెడ్పీటీసీ టికెట్ ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నాయి. కొందరికి ఎంపీటీసీ టికెట్ ఇస్తామంటున్నారంటే ప రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ చ్చు. ఇవేవీ కుదరకపోతే వాటిని మించిన నామినేటెడ్ పదవి ఇస్తామంటూ ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్నారు. పాతవారిపై వ్యతిరేకత ఉన్నచోట కొత్తవారిని బరిలోకి దిం చాలని భావిస్తున్నారు. ఏదైనా పర్లే దు టికెట్ ఇస్తే చాలంటూ కొందరు నేతలు సర్దుకుంటున్నారని పలువు రు గుసగుసలాడుతున్నారు.
Advertisement