రాష్ర్ట విభజన బిల్లును లోక్ సభ ఆమోదించడంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. నెహ్రూచౌక్ సమీపంలో ఉన్న రాహుల్‌గాంధీ ఫ్లెక్సీలను మంగళవారం రాత్రి ఆ పార్టీ కార్యకర్తలు చించివేశారు.
అనకాపల్లి, న్యూస్‌లైన్ :
రాష్ర్ట విభజన బిల్లును లోక్ సభ ఆమోదించడంతో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. నెహ్రూచౌక్ సమీపంలో ఉన్న రాహుల్‌గాంధీ ఫ్లెక్సీలను మంగళవారం రాత్రి ఆ పార్టీ కార్యకర్తలు చించివేశారు. రాహుల్ అమర్ రహే హై అంటూ నినాదాలు చేశారు. నెహ్రూ చౌక్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫ్లెక్సీలను తగులబెట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోనియా నియంతృత్వ పోకడలను పట్టణ కన్వీనర్ మందపాటి జానకీరామరాజు ఎండగట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగన్‌మోహన్‌రెడ్డి పోరాడిన సంగతిని ప్రజలు గుర్తుంచుకుంటారని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు తెలుగుజాతిని విడదీశాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సూరిశెట్టి రమణఅప్పారావు, వాకాడ బాబు, మాజీ కౌన్సిలర్లు కెఎం నాయుడు, పొట్ల అప్పారవు, బుద్ద రాజేశ్, బొబ్బిలి గోవింద, మడగల శ్రీను, పిళ్లా కొండయ్య నాయుడు ఎంఎల్‌వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.