
బిల్లును ఓడించామనడంలో అర్థం లేదు: అరుణ
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను ఓడించినట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా సీమాంధ్ర నేతలందరూ చెప్పుకొంటున్నారు గానీ, అందులో అర్థం లేదని రాష్ట్ర మంత్రి డీకే అరుణ అన్నారు. రాష్ట్రపతి బిల్లును పంపేటప్పుడు దానిపై కేవలం అభిప్రాయాలు మాత్రమే కోరారు తప్ప ఓటింగ్ పెట్టి ఆమోదించారో లేదో చెప్పాలని అడగలేదని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి పెట్టిన తీర్మానంతో అసలు సంబంధం లేదని, లగడపాటి రాజగోపాల్ లాంటి వారు తాము భ్రమల్లో ఉంటూ ప్రజలను కూడా మభ్య పెడుతున్నారని అరుణ విమర్శించారు. ఇకనైనా సీమాంధ్ర ప్రాంతానికి, ప్రజలకు ఏం కావాలో అడిగితే మంచిదని ఆమె హితవు పలికారు. తాము ఫిబ్రవరి 3వ వేదీన ఢిల్లీ వెళ్లి జీవోఎం సభ్యులను కలిసి తెలంగాణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరతామని డీకే అరుణ తెలిపారు.