సమైక్య పిటీషన్లను తోసిపుచ్చిన సుప్రీం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచాలంటూ దాఖలైన పిటీషన్లును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్లు తోసిపుచ్చింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మూడు పిటీషన్లు దాఖలైయ్యాయి. దీనిని సోమవారం విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. ప్రస్తుతం బిల్లు పార్లమెంట్ లో ఉన్నందును జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.
ఇదే అంశంపై ఫిబ్రవరి 7వ తేదీన విచారించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డెలతో కూడిన ధర్మాసనం స్టే విధించడానికి నిరాకరించింది. అయితే పిటిషనర్లు లేవనెత్తిన అన్ని అంశాలను ఓపెన్‌గానే ఉంచుతున్నాం. సరైన సమయంలో పిటిషనర్లు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే.