గ్రామాల్లో సమైక్యనినాదం హోరెత్తుతోం ది. గడపగడపకూ వైఎస్సార్‌సీపీ సమైక్య నినా దం పేరిట పార్టీ కో ఆర్డినేటర్లు నిర్వహిస్తున్న
హోరెత్తిన సమైక్యనినాదం
Jan 28 2014 12:53 AM | Updated on May 25 2018 9:12 PM
సాక్షి, కాకినాడ : గ్రామాల్లో సమైక్యనినాదం హోరెత్తుతోం ది. గడపగడపకూ వైఎస్సార్‌సీపీ సమైక్య నినా దం పేరిట పార్టీ కో ఆర్డినేటర్లు నిర్వహిస్తున్న పాదయాత్రలకు ప్రజల మద్దతు లభిస్తోంది. రాజమండ్రి 32వ డివిజన్‌లో నగర కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ పాదయాత్ర నిర్వహిం చారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు బొడ్డు వెంకటరమణచౌదరి, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి తదితరులతో కలసి పర్యటించారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ధవిళేశ్వరం శివారు ఎర్రకొండలో ఈ కార్యక్రమం నిర్వహించారు.పార్టీ సీజీసీ సభ్యురాలు, రాజానగరం కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మం డలం జంబుపట్నంలో చేసిన పాదయాత్రలో పలువురు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్తిపాడు మండలం వాకపల్లిలో, పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కుమార్ జగ్గంపేట మండలం సీతారామపురం, కృష్ణాపురంలలో నిర్వహించిన పాదయాత్రకు మంచి స్పందన లభించింది. జెడ్పీ మాజీ చైర్మన్, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రూరల్ మండ లం ఇంద్రపాలెంలో పాదయాత్ర నిర్వహించారు. తుని 1వ వార్డులో నియోజకవర్గ కో-ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పార్టీలో పలువురి చేరిక
పి.గన్నవరం మండలం ఉడిమూడిలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అధికార ప్రతినిధి పి.కె. రావు, నాయకులు మిండగుదిటి మోహన్ పాల్గొన్నా రు. రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్లమెంట్ కో- ఆర్డినేటర్ బొడ్డు వెంకట రమణచౌదరి సమక్షంలో బొమ్మూరులో సాయిలక్ష్మి నేతృత్వంలో పలువురు మహిళలు వైఎస్సార్ సీపీలో చేరారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.
నేటి వైఎస్సార్ సీపీ
సమావేశం రద్దు
సాక్షిప్రతినిధి, కాకినాడ : పులివెందులలో రెండు రోజులు జరగాల్సిన పార్టీ శిక్షణ తరగతులు రద్దవడంతో మంగళవారం కాకినాడలో జరగాల్సిన పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావే శం రద్దు చేశారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూ డి చిట్టబ్బాయి సోమవారం రాత్రి విలేకరులకు ఈ సంగతి తెలిపారు. కాగా తొలుత నిర్దేశించి న రీతిగా ఇడుపులపాయలో వచ్చే నెల 2న ప్లీనరీ జరుగుతుందని, దీనికి నాయకులంతా తరలి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement