రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల
సమైక్యమే జగన్ ఊపిరి
Published Sun, Jan 5 2014 4:17 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
బొబ్బిలి/మక్కువ, న్యూస్‌లైన్:రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్‌వీ సుజయ్‌కృష్ణ రంగారావు అన్నారు. వైఎస్సార్ సీపీతోనే సమైక్యాంధ్ర సాధ్యమని చెప్పారు. ఇందుకు కోసం చివరి వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. శని వారం మక్కువ మండల కేంద్రంలో జరిగిన సమైక్య శం ఖారావం సభలో ఆయన మాట్లాడారు. రాష్ర్ట విభజన కు కారణమైన కాంగ్రెస్, టీడీపీ మోసాలను ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణాలో అధిక స్థానాలు తెచ్చుకోవడానికి, రాహుల్‌ను ప్రధానిని చేయడానికి కాంగ్రెస్ విభజనకు సిద్ధమైతే, రాష్ట్రాన్ని విడగొట్టడానికి చంద్రబాబు వారితో కుమ్మక్కు అయ్యూరని ఆరోపిం చారు.
విభజన లేఖను వెనక్కి తీసుకోవాలని ఎంత డిమాండ్ చేసినా.. ఆయన స్పందించకపోవడమే అం దుకు నిదర్శనమన్నారు. విభజన వల్ల రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. సమైక్య పోరాటం ద్వారా జగన్ మరోసారి తన చిత్తశుద్ధిని ని రూపించుకున్నారని చెప్పారు. జగన్ నాయకత్వాన్ని బలపరిచి, టీడీపీ కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కన్వీనర్ పెను మత్స సాంబశివరాజు మా ట్లాడుతూ సమైక్యమే వైఎస్సార్ సీపీ లక్ష్యమన్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మాట్లాడుతూ తెలుగుజాతి, భాషను కాపాడుకోవడమే మన ముందున్న కర్తవ్యమన్నారు. వైఎస్ తన హయాంలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిర్యీర్యం చేస్తోందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తులు, పార్టీలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అరుకు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కొత్తపల్లి గీత మాట్లాడుతూ ప్రపంచానికి విలువైన సందే శం, మార్గదర్శకం చూపిన గాంధీ, అంబేద్కర్, మథర్‌థెరిసా లక్షణాలన్నీ మహానేత వైఎస్సార్‌లో ఉన్నాయన్నారు. నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయూలని పిలుపునిచ్చారు. పార్టీ అరుకు పరి శీలకుడు ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) మా ట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్, టీడీపీ విభజనకు తెర తీశాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహిం చారు. జేఎం విల్సన్ సమకూర్చిన మహాత్మాగాంధీ, అంబేద్కర్, మథర్ థెరిసా విగ్రహాలను నాయకులు ఆవిష్కరించారు. గ్రామీణ కళాకారులు తప్పెటగుళ్లు, దొమ్మరి మేళాలు వంటి వాటి ద్వారా సమైక్య గళాన్ని వినిపించారు.
వైఎస్సార్ సీపీ మండల కన్వీనరు మావుడి ప్రసాదనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ ఆదాడ మోహనరావు, కేంద్ర కార్యనిర్వాహక సభ్యుడు గరుడబిల్లి ప్ర శాంత్, పార్వతీపురం నియోజవర్గ సమన్వయకర్తలు కొ య్యాన శ్రీవాణి, గర్బాపు ఉదయభాను, సాలూరు నేత లు జరజాపు ఈశ్వరరావు, సూరిబాబు, గొర్లె మధుసూదనరావు, చింతల రామకృష్ణ, కర్రోతు తిరుపతి రావు, బొగ్గు పద్మజ, పూడి సూర్యనారాయణ, బొంగు చిట్టినాయుడు, కొంచాడ తవిటిరాజు, నరసింహమూర్తి, మూడడ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మక్కువ , శంబర గ్రామాలకు చెందిన 150 కుటుంబాలు బొగ్గు పద్మజ ఆధ్వర్యంలో పార్టీలో చేరారుు. వారికి నాయకు లు కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అంతకు ముందు మక్కువ ప్రధాన మార్కెట్‌లో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర ప్రారంభించారు.
Advertisement
Advertisement