ఢిల్లీ: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాన్ని కేంద్రం వేగవంతం చేసిన తరుణంలో సమైక్య వాదుల నిరసన కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సమైక్యా వాదులు కదం తొక్కుతున్నారు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వారు కేంద్రాన్నిహెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగానే సమైక్యాంధ్ర విద్యార్థులు ఏఐసీసీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విభజన అంశాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
తెలుగుజాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు సమైక్యావాదులు శనివారం రెండు ప్రత్యేక రైళ్లలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ నెల 17న జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే సమైక్య ధర్నాకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించింది.