ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య హీరో అనిపించుకోవాలని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు.
కర్నూలు : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య హీరో అనిపించుకోవాలని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య విలన్ అని వ్యాఖ్యానించారు. ఉవ్వెత్తిన సమైక్య ఉద్యమాన్ని అణిచివేసింది ముఖ్యమంత్రి కాదా అని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. సోనియా గాంధీ కనుసన్నల్లోనే కిరణ్ రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు.