
దాడి వీరభద్రరావు
విశాఖపట్నం: స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి కారణమైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కార నేరం కింద శిక్షి విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ నరసింహన్కు ఒక లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు, గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన కోరారు.
సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని ఆ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు.