ఒంగోలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం కందుకూరులో నిర్వహించిన మానవహారం, సమైక్య ర్యాలీలో ఆయన మాట్లాడారు. సమైక్య హీరోనంటూ ప్రచారం చేసుకుంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికీ నాటకాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండేందుకు పాటుపడుతున్న జగన్‌మోహన్‌రెడ్డికే అండగా ఉండేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలాజీ చెప్పారు.
కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మల నాయకత్వంలో మానవహారంగా ఏర్పడ్డారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి చర్చి సెంటర్ వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారేనని వైఎస్సార్‌సీపీ ఆది నుంచి గగ్గోలు పెడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డిలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్‌లో పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం టీడీపీ, కాంగ్రెస్‌లు కృషి చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోతుందని ప్రకటనలు వచ్చినప్పుడల్లా అన్నదాత కుంగిపోతున్నాడని విచారం వ్యక్తం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే భూములన్నీ సస్యశ్యామలమవుతాయని ఇప్పటివరకూ భావించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో మానవహారంగా ఏర్పడి సమైక్య ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తెలుగు జాతి గుండెల్లో గుణపాలు దించుతున్న సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డి, వారికి సహకరిస్తున్న చంద్రబాబునాయుడుకు సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ కృషి చేశారని, ఆయన మరణం తరువాత కొందరు అనుచితంగా మాట్లాడుతున్నారని మరో అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు అన్నారు.
కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, బీసీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొగర్త చెంచయ్య, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రమాదేవి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, నాయకులు సింగరాజు వెంకట్రావు, గంగాడ సుజాత పాల్గొన్నారు. టంగుటూరు ట్రంకురోడ్డులో పార్టీ మండల కన్వీనర్ బొట్ల రామారావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు.
ఇంకా కుమ్మక్కే
Published Tue, Jan 7 2014 3:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement