Nukasani Balaji
-
అభివృద్ధి ఆవగింజంత కూడా లేదు
ఒంగోలు: ‘అందరి కంటే ముందుగా పరిశుభ్ర ప్రకాశం పేరుతో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం. నాలుగు నెలలు గడిచినా మన అభివృద్ధి ఆవగింజంత కూడా లేదు. ఈ లక్ష్యాన్ని చేరుకోగల సత్తా ఉందంటే కొనసాగిద్దాం..ఈ సారైనా వంద శాతం లక్ష్యాన్ని సాధించాలి’ అని ఎంపీడీవోలనుద్దేశించి జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. స్థానిక పాత జెడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీవోలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. మండలానికి కనీసం రెండు గ్రామాల్లో సంపూర్ణంగా మరుగుదొడ్లు నిర్మించలేకపోయామన్నారు. గుడ్లూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో పందులు కాపురం పెట్టాయని, ఎంఈవో ఉన్న పాఠశాలలోనే పందులు పొర్లాడుతుంటే ఇక మిగతా పాఠశాలల్లో మార్పు ఎలా తీసుకురాగలమని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎంపీడీవో కార్యాలయానికి వెళ్తే ఒక్క అటెండరు తప్ప ఎవరూ లేకపోవడం బాధ్యతా రాహిత్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు. జెడ్పీ సీఈవో ఎ.ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలల్లో పరిశుభ్రత పెంపొందించేందుకు, ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన పాఠశాల కమిటీల ఏర్పాటును వారం రోజుల్లో పూర్తి చే యాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతి వారం ఎంపీడీవోల షెడ్యూల్‌ను జెడ్పీకి పంపాలని, క్యాంపునకు వెళ్లేటప్పుడు కూడా ఎక్కడకు వెళ్తున్నారో రికార్డుల్లో రాసిన తరువాతే వెళ్లాలన్నారు. ఆదర్శ గ్రామాలుగా ఎంపిక చేసిన వాటిలో నూరు శాతం టాయిలెట్ల లక్ష్యాన్ని 2015 ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలు జరుగుతున్న సమయంలో మరుగుదొడ్లకు తాళం వేసి ఉంటే సహించబోమన్నారు. డీఈవో విజయభాస్కర్ మాట్లాడుతూ ఎంఈవోలు తమ పరిధిలో ఉన్నత పాఠశాలలు లేవని చెప్పడం సరికాదని..ఏపీఆర్ఎస్ఏ పాఠశాలలున్నా వాటిని సైతం ఒకసారి పరిశీలించాలని సూచించారు. సాయంత్రం నిర్వహించిన సమావేశంలో జెడ్పీ ఆస్తులకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. పాఠశాలలకు ఆర్డబ్ల్యూఎస్ లేదా సర్పంచ్ల ద్వారా కుళాయి కనెక్షన్లు ఇప్పించాలనే అంశాలపై మాట్లాడారు. నెలాఖరు నాటికి లక్ష మరుగుదొడ్ల లక్ష్యం: మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి అధికారులు చెబుతున్న లెక్కలపై జెడ్పీ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలాఖరు నాటికి లక్ష టాయిలెట్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఈనెల 4న ప్రభుత్వం ఒక సర్క్యులర్ విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పటి వరకు జాబ్‌కార్డు కలిగి ఉన్నవారు ఎవరైనా మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.10 వేలు ఇచ్చేవారు, ఇక నుంచి దాన్ని రూ.12 వేలకు పెంచారు. అయితే దీనికి సంబంధించి ఉత్తర్వులు నేటికీ విడుదల కాలేదు. మరుగుదొడ్ల లబ్ధిదారుడ్ని మండల కోఆర్డినేషన్ కమిటీ ద్వారానే ఎంపిక చేయాలి. మండల కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి విధి విధానాలు కూడా రాలేదు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మూర్తికి పలు సూచనలు చేశారు. ఆయన కూడా ఎంపీడీవోలు అడిగిన పలు ప్రశ్నలకు వివరంగా సమాధానమిచ్చారు. నెలాఖరునాటికి లబ్ధిదారుల ఎంపిక, జనవరి 15 నాటికి మంజూరు ఉత్తర్వులు పొందడం, ఫిబ్రవరి 15వ తేదీనాటికి నిర్మాణాలు పూర్తయ్యేందుకు దృష్టి సారించాలని సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
అంతా మురికి మయం
ఒంగోలు : పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పందులు దొర్లుతుంటే స్వచ్ఛ భారత్‌ను ఎలా సాధించుకోగలం.. అందుకే ముందుగా వ్యవస్థను బలోపేతం చేస్తూ పచ్చని, పరిశుభ్ర ప్రకాశాన్ని సాధించేందుకు కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ఆయన్నే కొనసాగిస్తూ ఇటీవల కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో ఆయన గురువారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందే పచ్చని, పరిశుభ్ర ప్రకాశం పేరుతో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రధాని నరేంద్రమోడీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునివ్వడం తనకు సంతోషంగా ఉందన్నారు. స్వచ్ఛ ప్రకాశం అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని గుడ్లూరు ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం తాను ఆకస్మికంగా తనిఖీ చేశానని, అక్కడ మురుగులో పందులు దొర్లుతూ కనిపించాయని, గుడ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసి చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతంలో పందులు కనిపిస్తే చూడలేకపోయానన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి క్రమం తప్పకుండా పాఠశాలలను తనిఖీ చేస్తుంటే అలాంటి పరిస్థితులు ఉండవని ఆయనపై జెడ్పీ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అటువంటి వాతావరణం ఉండకూడదన్న ఉద్దేశంతో జన్మభూమి కార్యక్రమంతో మధ్యలో ఆగిపోయిన పచ్చని ప్రకాశం, పరిశుభ్ర ప్రకాశం కార్యక్రమాలను తిరిగి కొనసాగించాలని నిర్ణయించినట్లు బాలాజీ చెప్పారు. ఇందుకుగాను ఈ నెల 22న అన్ని మండలాల ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలలో విద్యార్థుల నుంచి సమాచారం సేకరించి ఏ ఇంటికి టాయిలెట్ సౌకర్యం లేదో గుర్తించి టాయిలెట్లు కట్టించుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ఒక్కో టాయిలెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేలు ఇస్తున్నందున ఉపాధ్యాయులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు గ్రామస్తులను చైతన్యం చేయాలని బాలాజీ పిలుపునిచ్చారు. అదే విధంగా గతంలో పచ్చని ప్రకాశం పేరుతో నాటిన మొక్కలపై కూడా అధికారులతో సమీక్షిస్తామన్నారు. పచ్చని ప్రకాశంకు, పరిశుభ్ర ప్రకాశం వంటి వినూత్న కార్యక్రమాలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని బాలాజీ హెచ్చరించారు. -
వీధికెక్కిన జెడ్పీ పోరు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎలాగైనా జెడ్పీ పీఠాన్ని తాము దక్కించుకోవాలని అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు వంతపాడుతున్నారు. ఈ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఎవరికివారు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు తీర్పు రాగానే దీనిపై కలెక్టర్‌కు ఆదేశాలు రాకుండానే ఈదర హరిబాబు జెడ్పీకి వచ్చి చైర్మన్ సీట్లో కూర్చుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై డివిజన్ బెంచి ముందు విచారణ జరుగుతున్నందున, తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో నూకసాని బాలాజీయే చైర్మన్‌గా కొనసాగుతారని అధికారులు ప్రకటించారు. ఈ వివాదం కోర్టులో నడుస్తున్న సమయంలో ఈదర హరిబాబు ప్రస్తుతం తాను జెడ్పీ చైర్మన్‌గానే కొనసాగుతున్నానని చెప్పడంతో అధికారులు చాంబర్‌కు తాళాలు వేయాలన్న నిర్ణయానికి వచ్చారు. గురువారం జెడ్పీ చైర్మన్ చాంబర్‌కు తాళాలు వేసేశారు. అధికారులు ఒక తాళం వేస్తే, ఈదర హరిబాబు మరో తాళం వేసేశారు. జిల్లా ప్రథమపౌరునిగా భావించే జెడ్పీ చైర్మన్ వ్యవహారంలో నిత్యం సాగుతున్న నాటకీయ పరిణామాలు చివరకు జెడ్పీ పరువును నడిరోడ్డుకు ఈడ్చాయి. జరుగుతున్న పరిణామాలతో జెడ్పీ పాలన కుంటుపడడమే కాకుండా అందులో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఇబ్బంది పడుతున్నారు. రోజూలాగే జెడ్పీకి వచ్చిన హరిబాబుకు చైర్మన్ చాంబర్‌కు తాళం వేసి కనపడింది. తాళం తీయమని అటెండర్‌ను అడిగితే తాళం జెడ్పీ సీఈవో వద్ద ఉందని సమాధానం ఇచ్చాడు. జెడ్పీ సీఈవోకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ తీయలేదు. దీంతో కావాలని తాళం వేసినట్లు అర్థం చేసుకున్న హరిబాబు దానికి నిరసనగా జెడ్పీ కార్యాలయం మెట్లపై బైఠాయించారు. ఈదర హరిబాబు జెడ్పీ విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ పోలీసులకు అధికారులు సమాచారం అందించారు. అయితే ఫిర్యాదు చేయడానికి సిద్ధం కాలేదు. దీంతో పోలీసులు జెడ్పీకి వచ్చినా ఎటువంటి చర్యలకు దిగకుండా కొద్దిసేపు వేచి చూసి వెళ్లిపోయారు. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోతో పాటు కార్యాలయ పరిపాలనాధికారి కూడా జెడ్పీ కార్యాలయానికి రాలేదు. ఎవరు ఫోన్ చేసినా వారు స్పందించలేదు. దీంతో వీరు అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకే వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. ఇటీవల జరిగిన బదిలీల విషయంలో కూడా అధికారుల తీరు ప్రశ్నార్థకంగా మారింది. పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరన్న సందిగ్ధ పరిస్థితిని అడ్డం పెట్టుకుని అధికారులు బదిలీలు పూర్తి చేశారు. బదిలీల విషయంలో జిల్లా పరిషత్ చైర్మన్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవో 979ని పక్కన పెట్టి పాత జీవోను చూపించి బదిలీలు పూర్తి చేశారు. జెడ్పీకి ఎన్నికైన పాలకవర్గం ఉన్నప్పటి కీ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధం లేకుండా రెవెన్యూ ప్రతినిధులతో కమిటీగా ఏర్పడి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించి జెడ్పీ వ్యవస్థనే అవమానపరిచారు. -
ఇప్పటికీ జెడ్పీ చైర్మన్‌ను నేనే : నూకసాని
ఒంగోలు సబర్బన్ : జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు తీరుపై ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు నగరంలో మంగళవారం రాత్రి ఆందోళనకు దిగాయి. కండబలంతో బీసీలను అణగదొక్కి జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం అప్రజాస్వామికమని గళమెత్తాయి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పుకోస్తున్న ఈదర.. కోర్టు నుంచి కలెక్టర్‌కు, జెడ్పీ కార్యాలయానికి ఉత్తర్వులు రాకుండానే మంది బలంతో జెడ్పీ పీఠంపై ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. 99 బీసీ కులాల సమాఖ్య ఆధ్వర్యంతో పాటు పలు దళిత సంఘాలు, ప్రజాసంఘాలు కూడా ఈ విషయమై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాయి. కలెక్టర్‌ను కలిసిన నూకసాని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మంగళవారం రాత్రి కలెక్టర్ విజయకుమార్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. జెడ్పీ చైర్మన్ పీఠం వ్యవహారాన్ని ఆయనతో బాలాజీ చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన నూకసాని మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ తానే జిల్లా పరిషత్ చైర్మన్‌నని, కలెక్టర్ కూడా అదే మాట చెప్పారని వివరించారు. హైకోర్టు ఆర్డర్ ఇంత వరకు కలెక్టరేట్కుగానీ, జిల్లా పరిషత్ కార్యాలయానికిగానీ రాలేదని చెప్పారు. దౌర్జన్యంగా, అప్రజాస్వామికంగా జెడ్పీ పీఠంపై ఈదర హరిబాబు కూర్చోవటాన్ని నూకసాని తీవ్రంగా ఖండించారు. జెడ్పీ చైర్మన్ వ్యవహారంపై కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి కూడా కలెక్టర్‌తో చర్చించినట్లు సమాచారం. -
జెడ్పీలో మరో వివాదం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మరోసారి వివాదంలో పడింది. జెడ్పీటీసీ పదవికి అనర్హుడిని చేస్తూ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను శుక్రవారం హైకోర్టు కొట్టివేయడంతో సోమవారం హడావిడిగా ఆ సీటులో ఈదర హరిబాబు ఆశీనులుకావడం వివాదాస్పదంగా మారింది. హైకోర్టు ఆదేశాలు కలెక్టర్‌కు అందిన తర్వాత దాన్ని పంచాయతీరాజ్ కమిషనర్‌కు పంపించాలి. అక్కడి నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత మళ్లీ సీటులో కూర్చోవాల్సిన ఈదర అవేవీ పట్టించుకోకుండా ..జిల్లాపరిషత్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నూకసాని బాలాజీ లేని సమయంలో జెడ్పీ కార్యాలయానికి వెళ్లి సీట్లో కూర్చోవడమే కాకుండా విలేకర్ల సమావేశం కూడా పెట్టారు. ఈదర హరిబాబుపై సస్పెన్షన్ వేటు పడటంతో పూర్తిస్థాయి ఛైర్మన్‌గా నూకసాని బాలాజీకి అధికారులు బాధ్యతలు అప్పగించిన విషయం విదితమే. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత అధికారుల నుంచి ఈదర హరిబాబుకు ఆదేశాలు రావాల్సి ఉంది. అవి వచ్చిన తర్వాత నూకసాని బాలాజీతో మాట్లాడి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే నూకసాని బాలాజీ శ్రీశైలం వెళ్లిన సమయంలో ఈదర వచ్చి సీటులో కూర్చున్న తరువాతనే బాలాజీకి ఫోన్ చేసి ఛైర్మన్‌ను మాట్లాడుతున్నానని చెప్పడంతో నూకసాని బాలాజీ మంచిది, కంగ్రాట్స్ అని సమాధానమిచ్చారు. దీనిపై నూకసాని బాలాజీ మాట్లాడుతూ కోర్టు ఆదేశాలను అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, అధికారులకు ఆదేశాలు రాకముందే వచ్చి సీట్లో కూర్చోవడం అహంకారపూరితమేనని విమర్శించారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈదర తెలుగుదేశం నేతల మద్దతు కోసం ప్రయత్నించారు. అయితే ఈదరకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించడానికి ఆ పార్టీ నేతలు ఇష్టపడలేదని సమాచారం. తాను వారి మద్దతు కోసం చేయి చాచినా తిరస్కరిస్తున్నారని, రాష్ట్రస్థాయిలో తనకు సహకారం ఉన్నా జిల్లాలో ‘ఇద్దరు’ తనను వ్యతిరేకిస్తున్నారని ఈదర వ్యాఖ్యానించడం గమనార్హం. అదివారం జిల్లా మంత్రిని కలవడానికి ఆయన ఇంటికి వెళ్లి రెండు గంటలపాటు వేచి చూసినా మంత్రి శిద్దా రాఘవరావు కలవడానికి ఇష్టపడలేదని తెలుగుదేశం శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈదర హడావిడిగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి బాధ్యతలు స్వీకరించిన సుజనా చౌదరిని కలిశారు. అయితే ఆయన కూడా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. మరోవైపు హైకోర్టు తీర్పుపై తెలుగుదేశం నాయకులు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో హడావిడిగా ఈదర జెడ్పీ సీట్లో కూర్చున్నట్లు సమాచారం. వారి మద్దతు కోరుతున్నానని చెబుతున్న ఈదర అవసరమైతే సుప్రీం కోర్టులో కూడా వారితో పోరాటానికి సన్నద్దమేనని చెప్పారు. కోర్టు ఆదేశాలు అందకుండానే బాధ్యతలు స్వీకరించడానికి ఈదర వస్తున్నట్టు తెలుసుకున్న జెడ్పీ అధికారులు ఎందుకైనా మంచిదని అందుబాటులో లేకుండా పోయారు. ఈదర వ్యవహరంపై జిల్లా కలెక్టర్ విజయకుమార్‌తో ‘సాక్షి’ మాట్లాడగా తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. కోర్టు ఆదేశాలు కూడా తనకు అందలేదని స్పష్టం చేశారు. -
ప్రకాశం జిల్లా పరిషత్ ‘కుర్చీ’ వివాదం
హైదరాబాద్: ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ కుర్చీ తనదంటే తనదంటూ ఇద్దరు నాయకులు గొడవపడ్డారు. హైకోర్డు ఉత్తర్వుల మేరకు జెడ్పీ చైర్మన్ గా ఈదర హరిబాబు బాధ్యతలు చేపట్టారు. అయితే అధికారులు లేకుండానే ఆయన బాధ్యతలు చేపట్టారు. జెడ్పీ ఛైర్మన్ ఈదర కాదని, తానేనంటూ నూకసాని బాలాజీ వివాదానికి దిగారు. ఈదరకు అనుకూలంగా వచ్చిన హైకోర్డు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని కలెక్టర్ విజయ్‌కుమార్ చెబుతున్నారు. -
నాన్నకు చదువంటే ఇష్టం: గోపీచంద్
‘నాన్న టీ కృష్ణకు చదువంటే ఎంతో ఇష్టం’ అని సినీ నటుడు గోపీచంద్ అన్నారు. ఒంగోలులో మంగళవారం నిర్వహించిన టీ కృష్ణ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: ‘నాన్నకు చదువంటే ఎంతో ఇష్టం. పేదరికం కారణంగా చదువుకోలేకపోతున్న వారికి భవిష్యత్‌లో మరింత సాయం అందిస్తానని’ సినీ హీరో, టీ కృష్ణ తనయుడు గోపీచంద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, కృష్ణ మెమోరియల్ కల్చరల్ సొసైటీలు స్థానిక సీవీఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన టీ కృష్ణ 28వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 28 ఏళ్ల నుంచి టీ.కృష్ణ వర్ధంతిని ఒంగోలులో అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రజలు నిర్వహించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు పేద విద్యార్థులకు చిన్న సాయం అందిస్తున్నానని, భవిష్యత్‌లో ఎక్కువ మందికి సాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీ అభిమానం, నాన్న ఆశీస్సులు ఉండటమేనని గోపీచంద్ తెలిపారు. జిల్లాపరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ టీ కృష్ణ జిల్లాలో ఒక వెలుగు వెలిగారన్నారు. విప్లవ భావాలు, విప్లవోద్యమాలు, అభ్యుదయవాదాలతో ముందుకు సాగారన్నారు. టీ కృష్ణ తీసిన సినిమాలు సమాజానికి కావలసిన అంశాలను ప్రస్తావించేవన్నారు. టీ కృష్ణ తనయుడు గోపచంద్ కూడా అడపాదడపా సమాజాన్ని చైతన్యపరిచే, మేలుకొలిపే సినిమాల్లో నటించాలని నూకసాని బాలాజీ కోరారు. ప్రజానాట్యమండలి నాయకుడు పోలవరపు సీతారామయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్వీ శేషయ్య, జిల్లా రంగస్థల కళాకారుల సమాఖ్య నాయకుడు పీ వీరాస్వామి, కృష్ణ మెమోరియల్ కల్చరల్ సొసైటీ ప్రతినిధి మోపర్తి నాగేశ్వరరావు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు నిడమానూరి నాగేశ్వరరావు, అన్నెం కొండలరాయుడు, షంషేర్ అహ్మద్, ఎస్డీ ఫజు లుల్లా, ఆళ్ల వెంకటేశ్వరరావు, పొన్నూరి వెంకటశ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 మంది పేద విద్యా ర్థులకు రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని గోపీచంద్ అందించారు. కృష్ణ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో గెలుపొందిన వారికి ట్రోఫీలు అందించారు. గోపీచంద్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఒక్కసారిగా వేదికపైకి ఎక్కేశారు. కొంతమంది మహిళలు చిన్న బిడ్డలతో తోసుకుంటూ రావడంతో గోపీచంద్ వారిని సున్నితంగా మందలించారు.చివరకు పోలీసు లు, నిర్వాహకులు గోడగా నిలబడి గోపీచంద్‌ను ఆయన కారు వరకు తీసుకువెళ్లారు. -
శాసిస్తే... ఖబడ్దార్
ఒంగోలు: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రెండో రోజైన శనివారం కూడా తీవ్ర వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశం హాలులో ప్రారంభమైన ఈ సమావేశంలో బాపట్ల ఎంపీ శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ పలుమార్లు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ జడ్పీ చైర్మన్‌ను విమర్శించడంతో ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అడ్డగోలు’ అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. సభాధ్యక్షుడ్ని గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి అంటూ హితవు పలికారు. తాను అడ్డగోలు తనంగా తీర్మానం పెట్టరాదని మాత్రమే చెప్పానని, అలా చేస్తే చట్టవిరుద్ధంగా చేశారంటూ ప్రభుత్వం రద్దుచేస్తుంది...అప్పుడు ఏం చేస్తారంటూ ఎంపీ చెబుతుండగానే జడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ప్రభుత్వంలో ఉన్నది మీరు...మంచిపనికి ..చెడ్డపనికి తేడా తెలియదా....మంచి పనిని ఫ్రభుత్వం ఎందుకు రద్దుచేస్తుంది....రాజకీయంగా మాట్లా డి జడ్పీని నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదంటూ మండిపడ్డారు. ఇప్పటికే స్టాండింగ్ కమిటీలు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా జిల్లా అభివృద్ధిని కూడా నిర్వీర్యం చేయాలని చూస్తే జడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వ్యవసాయంపై చర్చ... అనంతరం వ్యవసాయశాఖపై చర్చకు జెడ్పీ చైర్మన్ అనుమతించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతూ శనగకు ప్రత్యామ్నాయంగా ఏయే పంటలు వేసుకోవాలో రైతులను చైతన్యం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని విమర్శించారు. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలలో శనగలు నిల్వ ఉంచుకొని రైతాంగం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయ చర్యలపై మౌనం వహించడం సరికాదంటూ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, కౌలు రైతులకు రుణాలు తదితర అంశాలపైనా ప్రశ్నల పరంపర కొనసాగించారు. మార్కాపురం ప్రాంతాల్లో ఎరువులు, పురుగు మందుల ధరలు ఎంఆర్పీ కంటే దాదాపు వంద రూపాయల తక్కువకు విక్రయిస్తున్నారని, నాసిరకంగా ఉన్నాయేమో పరిశీలించాలని సూచించారు. అద్దంకి నియోజకవర్గంలో కొన్ని సొసైటీలకు ఎరువులు ఇచ్చి, మరికొన్ని సొసైటీలకు నిధులు ఇవ్వకుండా అధికారులు వ్యవహరించడం సరికాదంటూ అద్దంకి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో బల్లికురవ ఏవోపై ఏమి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లోపం ఎక్కడ జరిగిందో పరిశీలించి చర్యలు తీసుకుంటామని జేడీ మురళీకృష్ణ సమాధానమిచ్చారు. ఫారెస్ట్ అకాడమీని దోర్నాలలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలి సమైక్య రాష్ట్రంలో ఫారెస్ట్ అకాడమీ అదిలాబాద్ జిల్లాలో ఉందని, అయితే నేడు రాష్ట్రం విడిపోయిన తరువాత నల్లమల అటవీప్రాంతం దట్టంగా ఉన్న యర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాలలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలంటూ సమావేశంలో డేవిడ్‌రాజు సూచించారు. ప్రతిపాదనను తప్పకుండా ప్రభుత్వానికి పంపుతామంటూ జడ్పీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం అధికారులు తుఫాను ప్రభావ ప్రాంతాలలో సేవలందించేందుకు అం దుబాటులో ఉండాల్సి ఉన్నందున సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించారు. కైలాష్ సత్యార్థి....మలాలకు జడ్పీ అభినందనలు... బాల కార్మికుల నిర్మూలనకు , బాలికా విద్య కోసం ఒంటరి పోరాటం చేస్తూ నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన మధ్యపదేశ్ ఇంజినీర్ కైలాష్ సత్యార్థి, పాక్ బాలిక మలాలాను అభినందించే తీర్మానాన్ని అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవి కుమార్ ప్రవేశపెట్టగా సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ ప్రతిపాదించారు. మార్కాపురం శాసనసభ్యుడు జంకే వెంకటరెడ్డి, యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజులు మాట్లాడుతూ మధర్థెరెస్సా తరువాత నోబుల్ శాంతి బహుమతికి ఎంపికైన సత్యార్థి మన దేశవాసులందరికీ గర్వకారణమంటూ ప్రశంసించారు. 80 వేలమంది బాల కార్మికులకు విముక్తి కల్పించిన సత్యార్థికు అభినందనలు ప్రకటిస్తూ ప్రతిపాదించిన తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే అంశంపై కొండేపి శాసన సభ్యుడు డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ తీర్మానాన్ని తాము కూడా ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. -
నేడు ‘పచ్చని ప్రకాశం’
ఒంగోలు: ‘పచ్చని ప్రకాశం...పరిశుభ్రమైన ప్రకాశం’లో భాగంగా జిల్లా పరిషత్ తొలి అడుగు వేసింది. ‘పచ్చని ప్రకాశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి విడత శనివారం లక్ష మొక్కలు నాటేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈమేరకు జిల్లా అటవీశాఖ అధికారులతో కూడా చర్చించారు. లక్ష మొక్కలను అటవీశాఖ అధికారులు సిద్ధంగా ఉంచారు. పాఠశాలలే తొలి లక్ష్యం: జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పరిధిలో దాదాపు 4 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. లక్ష మొక్కలను పాఠశాలల్లోనే నాటడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలనేది జిల్లా పరిషత్ ఆకాంక్ష. అందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యం తీసుకునే బాధ్యత ఎంపీడీవోలపై ఉంచారు. ప్రతి పాఠశాలలో కనీసం 25 మొక్కల చొప్పున పెంచాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో స్థలాభావం వల్ల మొక్కలు పెంచలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఆవరణ, గ్రంథాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని దిశా నిర్దేశం చేశారు. -
తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టిపెట్టండి
ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పరిస్థితి దారుణంగా ఉంది..కనుక ప్రత్యేక దృష్టి సారించి తాగునీటి సమస్య లేకుండా చూడాలని జిల్లా అధికారులను జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆదేశించారు. జెడ్పీ కార్యాలయంలోని తన చాంబర్లో మంగళవారం రాత్రి ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఆయన సమీక్షించారు. సీపీడబ్ల్యూఎస్ స్కీముల పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద 847 ఆవాస గ్రామాల్లో మినరల్ వాటర్ పంపిణీ చేసేందుకు పథకం సిద్ధం చేశామన్నారు. పాఠశాలల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. దీనికోసం మండల స్థాయిలో ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, రాజీవ్ విద్యామిషన్ అధికారులు, ఎంఈవోతో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ చాలాచోట్ల మురుగునీటి పారుదల నిలిచిపోవడానికి ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులు అడ్డుపడడమే కారణమని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు దృష్టి సారించాలని కోరారు. దీనిపై ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలో ప్లాస్టిక్‌పై నిషేధం విధించేందుకు సిద్ధమయ్యారు. తాగునీరు వృథా కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించి తమకు ప్రభుత్వం గత ఏడాది 2.18 లక్షల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింద ని, ఇప్పటి వరకు 32 వేల నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇక నుంచి ఏడాదికి లక్ష చొప్పున నిర్మాణాలు పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. ఆర్వో ప్లాంట్ల పేరుతో ఎవరైనా నాణ్యతలేని నీటిని పంపిణీ చేస్తుంటే అటువంటివారు ఆ నీటిని తమ వద్దకు తెస్తే దానిని పరీక్షకు పంపించి తదుపరి చర్యలు తీసుకునేందుకు నిర్ణయించినట్లు అధికారుల సమావేశం అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు. సమీక్షలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ యూఎన్ఎస్ మూర్తి, ఒంగోలు ఈఈ షేక్ మద్దన్ఆలీ, డీఈ లతీఫ్, ఏఈ రమణ, జేఈ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
దొనకొండనే రాజధాని చేయాలి
ఒంగోలు అర్బన్ : జిల్లాలోని దొనకొండనే రాజధానిగా ఎంపిక చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ డిమాండ్ చేశారు. రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలూ ఆ ప్రాంతానికి ఉన్నప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పక్కనపెడుతోందని విమర్శించారు. స్థానిక వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొనకొండలో 55 వేల ఎకరాల ప్రభుత్వ భూమి, బ్రిటీష్ కాలంలో 136 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన విమానాశ్రయం, 120 ఎకరాల్లో రైల్వేస్టేషన్ ఉన్నాయని తెలిపారు. కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో సాగర్ కెనాల్, 20 కిలోమీటర్ల దూరంలో వెలిగొండ ప్రాజెక్టు, జాతీయ రహదారి ఉన్నాయన్నారు. రాజధానికి అవసరమైన ముఖ్య వసతులన్నీ ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం మధ్యలో దొనకొండ ఉన్నందున అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ సాధన సమితి కూడా రాజధానిని తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, లేకుంటే దొనకొండలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని బాలాజీ గుర్తుచేశారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది... రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాల ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన దొనకొండను రాజధానిగా పరిశీలించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని బాలాజీ విమర్శించారు. రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరి అవలంబించకుండా దోబూచులాడుతోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విజయవాడ, గుంటూరు ప్రాంతాలనే పట్టుకుని వేలాడుతోందన్నారు. అక్కడ రాజధాని నిర్మించాలంటే భూ సేకరణకే వేల కోట్ల రూపాయలు అవసరమన్నారు. అసలే లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూములు సేకరించి రాజధాని నిర్మించడం అసాధ్యమన్నారు. దొనకొండలో భూముల కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, నిర్మాణాలపై దృష్టిపెడితే సరిపోతుందని బాలాజీ పేర్కొన్నారు. సముద్రమట్టానికి ఎత్తులో ఉండటం వల్ల ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించవని తెలిపారు. దొనకొండను కాదని, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రాజధాని నిర్మిస్తే భవిష్యత్తులో మరో విభజన ఉద్యమం పుట్టే అవకాశముందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి దొనకొండనే రాజధానిగా ఎంపిక చేయాలని బాలాజీ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఎంపీ, ఎమ్మెల్యేలు... వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని బాలాజీ తెలిపారు. పార్లమెంట్ జరిగే సమయంలో తప్ప మిగతా సమయంలో వైవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారని చెప్పారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఆయన ఖండించారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ పాలడుగు విజేంద్రబహుజన్, జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, గ్రామీణ ఉపాధి కల్పనా విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీను పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి ఐక్యత అవసరం
వల్లూరు(టంగుటూరు),న్యూస్‌లైన్: తమ పార్టీలో పాతవారికి సముచిత స్థానం ఇస్తామని.. అలాగే కొత్తవారినీ ఆహ్వానిస్తున్నామని వైఎస్ఆర్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. వల్లూరులో గురువారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని సూచించారు. పార్టీని ఆదుకునేవారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆశయ సాధనకోసం వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందన్నారు. ప్రజల విశ్వాసం నుంచి వైఎస్ కుటుంబాన్ని వేరుచేయడం ఎవరితరమూ కాదని తెలిపారు. ఆ కుటుంబంపై చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. చంద్రబాబును ఎవరూ విశ్వసించడంలేదన్నారు. 9ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్పారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వైఎస్ సంక్షేమ పథకాలను తిరిగి సమర్థవంతంగా కొనసాగించగల నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. అందుకే ఆయన సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. వైఎస్ తమ మనిషని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆయన పథకాలను ఎందుకు మూలన పెడుతోందని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్‌లకు దీటుగా జగన్ పనిచేయగలరని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని, బూత్‌కమిటీలు ఏర్పాటు చే సి.. సమర్థులైన వారిని సభ్యులుగా నియమించాలని కోరారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న హనుమారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ కుందం హనుమారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ గ్రామానికి దివంగత నేత వైఎస్ చేసిన సేవలకు కృతజ్ఞతగా పార్టీలో చేరినట్లు హనుమారెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఓకే ఒక నాయకుడు జగన్ మాత్రమేనని అభినందించారు. మండల కన్వీనర్ బొట్లా రామారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తాటితోటి నరిసింగరావు, వల్లూరమ్మ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ ఉప్పలపాటి నర్సరాజు, పొందూరు సర్పంచ్ చిట్నీడి రంగారావు, ఎస్సీసెల్ రాష్ట్ర సభ్యుడు చెక్కా రాజేశ్వరరావు, మండల కన్వీనర్ దాసరి సుబ్బారావు, కుందం మోహనరెడ్డి, యువజన నాయకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాల్సిందే
ఒంగోలు, న్యూస్‌లైన్: ‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఇప్పుడు అసెంబ్లీ ముందు ఉన్న ఒకేఒక ఆయుధం సమైక్యాంధ్ర తీర్మానం చేయడమే. సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఆ దిశగా కృషి చేయాలి’ అని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా రెండో రోజు జరిగిన రిలే దీక్షల్లో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రంలో జరిగిన దీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఒక్కటే మార్గమన్నారు. కాంగ్రెస్ ఒక వైపు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తూ, మరోవైపు తమ పార్టీని టార్గెట్ చేయాలని చూడడం దారుణమన్నారు. ఇప్పటికైనా సీఎం కిరణ్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం 15 మంది నిరాహార దీక్షకు పూనుకున్నారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మలు రిలే దీక్షలను ప్రారంభించారు. ఇక్కడ 10 మంది, పామూరులో 8 మంది, వెలిగండ్లలో 17మంది దీక్షల్లో కూర్చున్నారు. దర్శిలోని రెవెన్యూ కార్యాలయ సమీపంలో చేపట్టిన దీక్షలను నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివప్రసాదరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర తీర్మానం చేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీలో చర్చ కోసం పట్టుబట్టి ఏదో ఒక విధంగా సోనియా గాంధీ నిర్ణయానికి మద్దతు పలకాలన్న కుట్రలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. టీడీపీ అధినేత ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతం పాటిస్తూ ప్రజలను వంచన చేస్తున్నారని మండిపడ్డారు. 33 మంది దీక్ష చేపట్టారు. గిద్దలూరులో 12 మంది దీక్ష వహించగా.. నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి ప్రారంభోపాన్యాసం చేశారు. మద్దిపాడులో జరిగిన దీక్షలను సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, వరికూటి అమృతపాణిలు ప్రారంభించారు. పెద్దారవీడులో సమన్వయకర్త పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో 15 మంది దీక్ష చేపట్టారు. చీరాలలో 9మంది దీక్షలో కూర్చోగా.. సమన్వయకర్తలు పాలేటి రామారావు, సజ్జాహేమలతలు ప్రారంభించారు. ఒంగోలులో వివిధ అనుబంధ సంఘాల నగర కన్వీనర్లు చేపట్టిన శిబిరాన్ని ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్ ప్రారంభించారు. యూత్ నగర కన్వీనర్ నెరుసుల రాము, సేవాదళ్ నగర కన్వీనర్ కంకణాల వెంకట్రావు, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ ముదివర్తి బాబూరావు, ఎస్సీసెల్ నగర కన్వీనర్ వై.రమేష్, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, బీసీ విభాగం నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, విద్యార్థి విభాగం నగర కన్వీనర్ రేలా అమర్నాథ్రెడ్డి, ప్రచార కమిటీ నగర కన్వీనర్ దూళిపూడి ప్రసాద్‌నాయుడు, నగర అధికారప్రతినిధి రొండా అంజిరెడ్డి, స్టీరింగ్ కమిటీ సభ్యులు రాయని వెంకట్రావు, గాలేటి వెంకటేశ్వర్లు, మారెడ్డి రామకృష్ణారెడ్డి, మహిళా నాయకులు పాలేటి లక్ష్మి, బత్తుల ప్రమీల, ఎస్.మహాలక్ష్మి, షేక్ రసూల్, గంధం సామేలు, వర్థుశేషయ్య తదితరులు దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షకు హాజరైన జిల్లా అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, వాణిజ్య విభాగం జిల్లా కన్వీనర్ డీఎస్ క్రాంతికుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తోటపల్లి సోమశేఖర్ సంఘీభావం ప్రకటించారు. -
సమైక్యనాదమే జగన్నినాదం
ఒంగోలు, న్యూస్‌లైన్: సమైక్యనాదమే జగన్నినాదమని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ అన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళవారం జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులోని రిలే దీక్ష శిబిరంలో నియోజకవర్గ సమన్వయకర్తలు నూకసాని బాలాజీ, తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఇరుప్రాంతాలు తీవ్రంగా నష్టపోయి అభివృద్ధి కుంటుపడుతుందని తెలిసినా మొండిగా రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూడటం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం అధికార దాహంతో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ బిల్లు చర్చకన్నా ముందే అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని వైఎస్సార్ సీపీ కోరినా.. కాంగ్రెస్, టీడీపీలు మొద్దు నిద్ర వీడకపోవడం దారుణమన్నారు. దీక్షలో 16 మంది కూర్చున్నారు. కనిగిరిలో చేపట్టిన రిలే దీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మలతోపాటు వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు వై.నాగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముక్కలైతే అభివృద్ధి కల్ల అన్నారు. సంక్షేమ రాజ్యం కోసం జనం ఎదురుచూస్తుంటే సంక్షోభ రాజ్యాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డి సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కనిగిరిలో 9 మంది దీక్ష చేపట్టారు. వీరితోపాటు జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, యువజన విభాగం నాయకుడు బన్నీ తదితరులు పాల్గొన్నారు. పామూరులో 8 మంది, వెలిగండ్లలో 16 మంది రిలే దీక్షలో కూర్చున్నారు. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పెద్దదోర్నాల నటరాజ్ సెంటర్లో రిలే దీక్షను నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్ర కడగండ్లు ఎదుర్కొంటున్న పశ్చిమ ప్రకాశం రైతులు వెలిగొండ ప్రాజెక్టు వస్తేనైనా తమ బతుకులు బాగుపడతాయని గంపెడాశెతో ఉన్నారన్నారు. కానీ రాష్ట్ర విభజన పేరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఆ నమ్మకాన్ని సైతం వమ్ము చేస్తున్నాయని, ప్రతి రైతు సమైక్యాంధ్రకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక్కడ 12 మంది దీక్షలో కూర్చున్నారు. మార్కాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద నియోజకవర్గ సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి సమైక్యాంధ్ర దీక్షను ప్రారంభించారు. మొత్తం పది మంది దీక్ష చేపట్టారు. గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి రిలే దీక్షను ప్రారంభించారు. మొత్తం 12 మంది దీక్ష చేపట్టారు. దర్శిలో తొలిరోజు నలుగురు దీక్ష చేపట్టగా..జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కుమ్మిత అంజిరెడ్డి దీక్షలను ప్రారంభించారు. ఒంగోలులో వైఎస్సార్ సీపీ బీసీసెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, బీసీ సెల్ నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, బీసీ విభాగం రాష్ట్ర నాయకులు పొగర్త చెంచయ్య, బూర్సు మాలకొండయ్యతో కలిపి మొత్తం 25 మంది దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మాత్రమే రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగలరన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు సమైక్యాంధ్రపై నాటకాలాడుతూ ప్రజలను దారుణంగా మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల దళిత విభాగం కోఆర్డినేటర్ పాలడుగు విజేంద్ర బహుజన్, వైఎస్సార్ సీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, గోవర్థన్‌రెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, గంగాడ సుజాత తదితరులు ప్రసంగించారు. -
ఇంకా కుమ్మక్కే
ఒంగోలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నూకసాని బాలాజీ ఆరోపించారు. సమైక్యాంధ్ర కోసం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం కందుకూరులో నిర్వహించిన మానవహారం, సమైక్య ర్యాలీలో ఆయన మాట్లాడారు. సమైక్య హీరోనంటూ ప్రచారం చేసుకుంటున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికీ నాటకాలాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండేందుకు పాటుపడుతున్న జగన్మోహన్రెడ్డికే అండగా ఉండేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలాజీ చెప్పారు. కనిగిరిలో నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మల నాయకత్వంలో మానవహారంగా ఏర్పడ్డారు. తొలుత పార్టీ కార్యాలయం నుంచి చర్చి సెంటర్ వరకూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని సీమాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారేనని వైఎస్సార్సీపీ ఆది నుంచి గగ్గోలు పెడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డిలు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో పెద్ద ఎత్తున మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం టీడీపీ, కాంగ్రెస్‌లు కృషి చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం విడిపోతుందని ప్రకటనలు వచ్చినప్పుడల్లా అన్నదాత కుంగిపోతున్నాడని విచారం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు వినియోగంలోకి వస్తే భూములన్నీ సస్యశ్యామలమవుతాయని ఇప్పటివరకూ భావించిన వారికి తీవ్ర నిరాశ ఎదురైందని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో మానవహారంగా ఏర్పడి సమైక్య ర్యాలీ నిర్వహించారు. బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అధికారం ఉంది కదా అని రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తెలుగు జాతి గుండెల్లో గుణపాలు దించుతున్న సోనియా, కిరణ్‌కుమార్‌రెడ్డి, వారికి సహకరిస్తున్న చంద్రబాబునాయుడుకు సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కృషి చేశారని, ఆయన మరణం తరువాత కొందరు అనుచితంగా మాట్లాడుతున్నారని మరో అధికార ప్రతినిధి కొఠారి రామచంద్రరావు అన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, బీసీ విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు పొగర్త చెంచయ్య, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రమాదేవి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, నాయకులు సింగరాజు వెంకట్రావు, గంగాడ సుజాత పాల్గొన్నారు. టంగుటూరు ట్రంకురోడ్డులో పార్టీ మండల కన్వీనర్ బొట్ల రామారావు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడ్డారు. -
నేడు బంద్
ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభ జన ప్రక్రియను అడ్డుకునేందుకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ తెలిపారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి నుంచి శాసనసభ ఆమోదం కోసం వచ్చిన విభజన బిల్లును సభలో ప్రవేశపెట్టరాదన్నారు. విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెడితే ఆమోదించినా..ఆమోదించకపోయినా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మారుతుందన్నారు. సమైక్యాంధ్రకు సంఘీభావంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, రాష్ట్రానికి పట్టిన విభజన పీడ ఎదుర్కొనేందుకు వారం రోజులపాటు వైఎస్ఆర్ సీపీ కార్యాచరణ రూపొందించిందన్నారు. శుక్రవారం అన్ని విద్యా, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసేసి తమకు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి సమైక్యవాది బంద్‌కు సంఘీభావం తెలపాలని కోరారు. 4వ తేదీ మోటారు బైకు ర్యాలీ, 6న మానవహారం, 7వ తేదీ నుంచి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు సమన్వయకర్తలు, జిల్లా అనుబంధ కమిటీ నాయకులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల/నగర కన్వీనర్లు, వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి గర్హనీయం: అద్దంకిలో వైఎస్సార్సీపీ నాయకులపై జరిగిన దాడిని నూకసాని బాలాజీ తీవ్రంగా ఖండించారు. 30 ఏళ్లపాటు రాజకీయ జీవితంలో ఉన్న కరణం బలరాం ఇటువంటి చర్యలను ప్రోత్సహించడం హేయమన్నారు. హింసాత్మక రాజకీయాలే తమ ఎదుగుదలకు కారణమనుకుంటే దానిని ఎదుర్కోవడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంటుందన్నారు. హింసావాద రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వంట గ్యాస్ ధరల పెంపు దారుణంగా ఉందన్నారు. ఒకేరోజు రూ.250 ధర పెంచితే సామాన్యుడు ఆ భారాన్ని ఎలా భరించగలడన్నారు. ఇది సరైన చర్య కాదని, వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆధార్‌తో సంబంధం లేకుండా సిలిండర్లు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో గ్రామీణ, ఉపాధి పరిశ్రమల విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి పాల్గొన్నారు. -
నేటి నుంచి వైఎస్ఆర్ సీపీ ఆందోళనలు
ఒంగోలు, న్యూస్‌లైన్: వంద రోజులకుపైగా సీమాంధ్రులు ఉద్యమిస్తున్నా పట్టించుకోని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సమాయత్తం కావాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ స్థానిక కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర విభజనను కేంద్రమంత్రి వర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ వివిధ రకాల ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నెల పదో తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువతతో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. 11న ట్రాక్టర్లతో ర్యాలీ, 12న రాష్ట్ర, జాతీయ రహదారుల దిగ్భంధంతోపాటు రోడ్లపై వంటావార్పు ఉంటాయని వెల్లడించారు. 14 నుంచి రోజుకో నియోజకవర్గంలో నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు. ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ కార్యక్రమాలను జిల్లాకు చెందిన కేంద్రపాలకవర్గ మండలి సభ్యులు, జిల్లా అధికార ప్రతినిధులు, జిల్లా వివిధ అనుబంధ విభాగాల కన్వీనర్లు, నగర, మండల కన్వీనర్లు, జిల్లా కమిటీల సభ్యులు, సమైక్యవాదులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు శృంగభంగమే.. ఢిల్లీ ఫలితాల మాదిరిగానే రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు శృంగభంగం తప్పదని బాలాజీ పేర్కొన్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఆల్మట్టి ఎత్తు పెంచితే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీరు రాదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వచ్చే అన్ని రకాల అప్పీళ్లను పరిశీలిస్తామని జీఓఎం చెప్పిన మాటలు అబద్ధమన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న జగన్మోహన్రెడ్డికి మద్దతివ్వాలని కోరారు. కార్యక్రమంలో నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు పాల్గొన్నారు. -
విజయమే లక్ష్యంగా..
జిల్లాలో అన్ని నియోజకవర్గాలు, సామాజిక, ఇతర వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. జిల్లా కార్యవర్గంలో అధ్యక్షుడితోపాటు ఐదుగురు ప్రధాన కార్యదర్శులు, 10 మంది కార్యదర్శులు, 15 మంది సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు 30 నుంచి 60 మంది ఉంటారు. వారితోపాటు కోశాధికారి, ఐదుగురు అధికార ప్రతినిధులను నియమిస్తారు. మండల, గ్రామ స్థాయిలో కూడా పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తారు. మండల కమిటీలో పార్టీ అధ్యక్షుడు, ముగ్గురు కార్యదర్శులు, ఐదుగురు సంయుక్త కార్యదర్శులు, కోశాధికారి ఒకరు, కనీసం 10 మంది కార్యవర్గ సభ్యులను నియమిస్తారు. పంచాయతీ కమిటీలో అధ్యక్షుడితోపాటు ఇద్దరు కార్యదర్శులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శులు,ఒక కోశాధికారి,కనీసం 8మంది సభ్యులు ఉంటా రు. అదే విధంగా పార్టీ 18 అనుబంధ విభాగాల జిల్లా కార్యవర్గాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక రాష్ట్ర కార్యవర్గంలో కూడా జిల్లా నుంచి కొంతమందికి ప్రాతినిధ్యం కల్పిస్తారు. బూత్ కమిటీలు ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో కీలకపాత్ర పోషించే బూత్ కమిటీలపై పార్టీ దృష్టి సారించింది. బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని గతంలోనే ఆదేశించినప్పటికీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఇంతవరకు కొంత అలసత్వం చూపించారు. దీనిపై పార్టీ నాయకత్వం తీవ్రంగానే స్పందించింది. బూత్ కమిటీల ఏర్పాటుకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి 80 మంది ఓటర్లకు ఒక సభ్యుడు చొప్పున బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. బూత్ కమిటీకి ఒక కన్వీనర్‌తోపాటు 10 నుంచి 20 మంది వరకు సభ్యులుంటారు. అవసరాన్ని బట్టి సభ్యుల సంఖ్యను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. కనీస సభ్యుల సంఖ్య 10కి తగ్గకూడదని స్పష్టం చేశారు. పనితీరుపై సమీక్ష.. జిల్లా, మండల, గ్రామ కార్యవర్గాల పనితీరును రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ఈ కార్యవర్గాలు నెలకు కనీసం ఒకసారైనా సమావేశమవుతాయి. రెండు నెలలకు ఒకసారి జిల్లా, మండల, గ్రామస్థాయిలో పార్టీ విసృ్తతస్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. ముందుగా వెంటనే ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమాన్ని మళ్లీ చేపట్టాలని రాష్ట్ర పార్టీ ఆదేశించింది. నియోజకవర్గ సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని స్పష్టంచేసింది. ‘గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్’ కార్యక్రమం చేస్తూనే బూత్ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడంతోపాటు విసృ్తతంగా జనబాహుళ్యంలోకి వెళ్లేదిశగా కార్యాచరణ చేపట్టనుంది. ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా: బాలినేని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయానికి దోహదపడే దిశగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే బాలినేని ‘సాక్షి’తో చెప్పారు. 15 రోజుల్లో జిల్లా, మండల, పంచాయతీ కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో విస్తృత స్థాయి సమావేశం: నూకసాని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశించిన విధంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని వైఎస్సార్ సీపీ కన్వీనర్ నూకసాని బాలాజీ ‘సాక్షి’తో చెప్పారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బాలినేనితో చర్చించానని తెలిపారు. ఆయన సూచనల మేరకు త్వరలోనే జిల్లా, మండల, పంచాయతీ కార్యవర్గాలను నియమిస్తామన్నారు. అందుకు సన్నాహకంగా త్వరలోనే జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. -
అడుగడుగునా దిగ్బంధం
= సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల రాస్తారోకోలు = జిల్లా వ్యాప్తంగా అనూహ్య స్పందన = సమైక్యమే తమ లక్ష్యమన్న జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ = 363 మంది అరెస్టు, విడుదల = నేడు కూడా రహదారుల దిగ్బంధం ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బుధవారం రహదారుల దిగ్బంధం విజయవంతమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గురువారం కూడా రహదారుల దిగ్బంధం చేసి సమైక్యవాదాన్ని చాటిచెబుతామని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ప్రకటించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు సమైక్య రాష్ట్రం కోరుకునే ప్రతి ఒక్కరూ సమైక్యనాదం వినిపించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాస్తారోకోల సందర్భంగా జిల్లావ్యాప్తంగా 363 మందిని అరెస్టు చేసిన పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఒంగోలులో నాలుగు దఫాలుగా రహదారులు దిగ్బంధించారు. ఉదయం 8.45 నుంచి 9.45 వరకు గంటపాటు త్రోవగుంట జంక్షన్లో రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ మారెడ్డి సుబ్బారెడ్డి, పార్టీ ఒంగోలు మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య, నాయకులు సింగరాజు వెంకట్రావు, మండువ సుబ్బారావు తదితరులు జాతీయ రహదారిపై అడ్డంగా బైఠాయించారు. క్షణాల్లోనే పెద్ద ఎత్తున వాహనాలు అన్ని మార్గాల్లో నిలిచిపోయాయి. చివరకు లారీల యజమానులు, ట్రాక్టర్ల యజమానులు కూడా ఈ దిగ్బంధానికి మద్దతు పలికారు. కార్యక్రమం చేపట్టగానే వారు కూడా తమ వాహనాలను రోడ్డుకు అడ్డంగా ఉంచి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులు అరెస్టు చేస్తామని హెచ్చరించినప్పటికీ నాయకులు మాత్రం పట్టువీడలేదు. దీంతో ఒంగోలు తాలూకా పోలీసులు బలవంతంగా అరెస్టుచేసి 15 మందిపై కేసులు నమోదు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉదయం 10.45 గంటలకు స్థానిక దక్షిణ బైపాస్‌లో రాస్తారోకో చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ బాలాజీ, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధులు నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ విభజన అంటూ జరిగితే రాష్ట్రం మొత్తం ఎడారిగా మారిపోతుందన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలిసినా కేవలం రాజకీయ స్వార్థంకోసం విడదీయాలనుకోవడం దుర్మార్గమన్నారు. అరెస్టులకు భయపడేదే లేదని, గురువారం కూడా రహదారులను దిగ్బంధం చేస్తామని ప్రకటించారు. ఇక్కడ 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక మంగమూరు రోడ్డు జంక్షన్లో జాతీయ రహదారిని దిగ్బంధించారు. గంటపాటు జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, నగర కన్వీనర్ కావూరి సుశీల, మహిళా నాయకురాళ్లు బడుగు ఇందిర, రమాదేవి, సుబ్బులు, రాజేశ్వరి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు 11 మంది మహిళలను అరెస్టు చేశారు. సాయంత్రం 4.15 గంటలకు స్థానిక మంగమ్మ కాలేజీ జంక్షన్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని చీమకుర్తి, సంతనూతలపాడు మండలాలకు చెందిన నాయకులు, జిల్లా యువజన, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త అంగలకుర్తి రవి, సంతనూతలపాడు, చీమకుర్తి మండలాల కన్వీనర్లు దుంపా చెంచిరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, దుంపా యలమందారెడ్డి, బాపట్ల వెంకట్రావు, రావులపల్లి కోటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, నగర కన్వీనర్ నెరుసుల రాము, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, నగర కన్వీనర్ అమర్నాథరెడ్డి, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. నూకసాని బాలాజీతోపాటు 14 మందిని పోలీసులు అరెస్టుచేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. - మద్దిపాడులో ఉదయం 10.30 నుంచి 11.30 వరకు హైవేపై జరిగిన రాస్తారోకో కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల కన్వీనర్లు మండువ అప్పారావు, దివి పున్నారావు తదితరులు పాల్గొన్నారు. - చీరాలలో వేటపాలెం స్ట్రెయిట్ కట్ వద్ద చీరాల నియోజకవర్గ సమన్వయకర్తలు పాలేటి రామారావు, అవ్వారు ముసలయ్య, యడం చినరోశయ్య, సజ్జాహేమలతతోపాటు ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి యడం చినబాలాజీ, చీరాల పట్టణ కన్వీనర్ యాతం ఆనందరావు తదితరులు ఉదయం 10.40 నుంచి 11.40 వరకు జాతీయ రహదారిని దిగ్బంధించారు. - అద్దంకిలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ఆర్టీసీ బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండు సెంటర్లో ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులికం కోటిరెడ్డి, వైస్ చైర్మన్ కే.అంకారావు తదితరులు పాల్గొన్నారు. - వ్యవసాయ విభాగం రాష్ట్ర నాయకుడు వల్లభురెడ్డి సుబ్బారెడ్డి తదితరులు కలిసి మార్టూరులో జాతీయ రహదారిపై గంటపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. - టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తాటితోటి నరశింగరావు, పలు మండలాల కన్వీనర్లతో కలిసి 10.50 నుంచి 11.40 వరకు రాస్తారోకో చేశారు. అనంతరం టంగుటూరు-కొండపి మార్గంలో రహదారిని దిగ్బంధించారు. - ఉలవపాడు మండలం రాజుపాలెం వద్ద దాదాపు రెండు గంటలు, గుడ్లూరు మండలం తెట్టు వద్ద గంటపాటు జరిగిన రాస్తారోకోలో కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్తలు తూమాటి మాధవరావు, ఉన్నం వీరాస్వామి పాల్గొన్నారు. - కనిగిరిలో ఉదయం 5.30 గంటలకే బస్సులను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దాదాపు 8.30 గంటలపాటు చెక్‌పోస్టు వద్ద బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పామూరు బస్టాండు వద్ద వాహనాల రాకపోకలను నిలిపేశారు. పట్టణ కన్వీనర్ ఖాదర్‌తోపాటు యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు వైయం.ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. - దర్శిలో తాజా మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, మండల కన్వీనర్లు కలిసి గడియారస్తంభం సెంటర్లో రాస్తారోకో చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పడుతున్న తపనను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని, నాయకులు కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సమైక్యాంధ్రకు సంఘీభావం ప్రకటించేందుకు కదిలిరావాలని శివప్రసాదరెడ్డి పిలుపునిచ్చారు. - మార్కాపురంలో నియోజకవర్గ సమన్వయకర్తలు జంకె వెంకటరెడ్డి, వెన్నా హనుమారెడ్డిలు రాస్తారోకో చేపట్టగా మరో నియోజకవర్గ సమన్వయకర్త ఉడుముల శ్రీనివాసరెడ్డి పొదిలిలో రాస్తారోకో చేశారు. పొదిలి పోలీసులు ఉడుముల శ్రీనివాసరెడ్డితోపాటు మరో 50 మందిని అరెస్టు చేశారు. - గిద్దలూరు బస్టాండు సెంటర్లో నియోజకవర్గ సమన్వయకర్తలు ముత్తుముల అశోక్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర నినాదాలు చేయడంతో పాటు, పెరిగిన ఆర్టీసీ చార్జీలను కూడా నిరశించారు. దాదాపు మూడు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం గిద్దలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణకు వినతిపత్రం అందజేశారు. కొమరోలులో చెక్‌పోస్టు వద్ద, బేస్తవారిపేటలో చింతలపాలెం వద్ద, అర్థవీడు మండలం నాగులవరం జంక్షన్ వద్ద జరిగిన రాస్తారోకోల్లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు పాల్గొన్నారు. - మాచర్ల-వై.పాలెం జాతీయ రహదారిపై పుల్లలచెరువు మండలం మల్లపాలెం వద్ద జరిగిన రాస్తారోకోలో యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు పాల్గొన్నారు. రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకోను పోలీసులు అడ్డుకొని బలవంతంగా డేవిడ్రాజుతోపాటు 150 మందిని అరెస్టు చేశారు. -
సమైక్య శంఖారావం సభను జయప్రదం చేయండి
ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధన కోసమే హైదరాబాద్‌లో ఈ నెల 26న సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు. రాష్ట్ర కమిటీ ముద్రించిన సమైక ్యశంఖారావం వాల్‌పోస్టర్‌ను స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభకు ప్రజలు పార్టీలకతీతంగా హాజరు కావాలని కోరారు. సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విడిపోతే అభివృద్ధి జరుగుతుందని కొంతమంది చేసే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీయేనని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లే సమైక్యాంధ్ర సాధ్యమవుతుందన్నారు. మహానేత వైఎస్ఆర్ మరణం తరువాత సంక్షేమ పథకాలు పేదల దరి చేరడం లేదని, ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజానీకానికి అందాలంటే జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమన్నారు. రాష్ట్ర విభజనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణలోని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్రెడ్డి కుమ్మక్కయ్యారంటూ జిల్లాకు చెందిన కొందరు నాయకులు దుష్ర్పచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. సమైక్య శంఖారావం సభ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజానీకానికి సంబంధించిందన్నారు. సభకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం హాజరై రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించనున్నట్లు చెప్పారు. ‘రాష్ర్టం మొత్తం సమైక్యంగా ఉంటేనే ఢిల్లీతో పోరాడగలుగుతాం. కావాల్సింది సాధించుకోగలుగుతాం. విడిపోతే నష్టమే. స్వార్థపరుల మాటలు విని మోసపోవద్దు’ అని బాలాజీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర స్టీరింగ్ కమిటీ సభ్యుడు వల్లెపు మురళి పాల్గొన్నారు. -
ఉద్యమాన్ని అణచివేస్తున్న సీఎం
ఒంగోలు, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో నిర్వహిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అణచివేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్జీఓలు, ఉద్యోగులపై ఒత్తిడి పెంచి వారితో సమ్మెను విరమింపజేశారన్నారు. సమైక్యవాదినని చెప్పుకుంటూనే రాష్ట్ర విభజనకు అనుకూలంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ అధిష్టానం చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక వైఎస్ఆర్ సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్జీఓలు, ఉద్యోగ జేఏసీలు, ఆర్టీసీ కార్మికులు ఎంతో చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించారని అభినందించారు. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చల పేరుతో ఉద్యమాన్ని నీరుగార్చారని విమర్శించారు. ఉద్యోగులతో బలవంతంగా సమ్మెను విరమింపజేయించారన్నారు. తాను సమైక్యవాదినంటూ గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి.. ఉద్యమంపై నీళ్లుచల్లి అధిష్టానం భజనచేస్తూ సీమాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతేగాకుండా సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావం సభను సైతం అడ్డుకునేందుకు యత్నించారని బాలాజీ పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్య పేరుతో పోలీస్‌శాఖ ద్వారా సభ కు అనుమతి రాకుండా సీఎం చే సిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రెండు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే జగన్మోహన్రెడ్డి జైలులో ఉండి ఒకసారి, బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఆమరణదీక్షలు చేపట్టారన్నారు. సమైక్యాంధ్ర కోసం ఇప్పటివరకు తమ పార్టీతోపాటు సీపీఎం, ఎంఐఎం లాంటి పార్టీలు ముందుకు వచ్చాయన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ఢిల్లీలో కాలంవెళ్లదీయకుండా అత్యవసరంగా అసెంబ్లీని సమావేశపరిచేందుకు వైఎస్ఆర్ సీపీ బాటలో నడవాలని హితవుపలికారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించేందుకు కలిసి రావాలన్నారు. అదే విధంగా సమైక్యాంధ్ర కోసం ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో వైఎస్ఆర్ సీపీ నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావానికి జిల్లావ్యాప్తంగా ఎన్జీఓలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు తరలిరావాలని బాలాజీ పిలుపునిచ్చారు. సమైక్య శంఖారావాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ వై.వెంకటేశ్వరరావు, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ, వివిధ విభాగాల నగర కన్వీనర్లు ముదివర్తి బాబూరావు, కావూరి సుశీల తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు మతిభ్రమించింది
ఉలవపాడు (కందుకూరు), న్యూస్‌లైన్: రాష్ట్రం ఒక పక్క భగ్గుమంటూ అతలాకుతలమవుతుంటే ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దీక్ష చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. 72 గంటల నిరవధిక బంద్ సందర్భంగా చివరి రోజు ఆదివారం ఉలవపాడులో హైవే దిగ్బంధం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నూకసాని మాట్లాడుతూ సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా నానా అవస్థలు పడుతుంటే చంద్రబాబు మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నాడని, ఆయన వ్యవహార శైలి ఆయన సన్నిహితులకే అంతుపట్టడం లేదన్నారు. అసలు ఢిల్లీలో దీక్ష ఎందుకు చేస్తున్నారో ఇంత వరకు స్పష్టంగా చెప్పకపోవడం విడ్డూరమన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ టీడీపీ నాయకులతో కలిసి తెలంగాణ ను విడగొట్టాలని సోనియాకు చెప్పినట్లు స్పష్టమవుతోందన్నారు. ఈ వ్యవహారం టీడీపీ ఎంపీ సీఎం రమేష్, బొత్స సత్యన్నారాయణను అతి రహస్యంగా కలవడంతోనే బయటపడిందన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి కుయుక్తులు పన్నుతూ జగన్‌పై వాటిని నెట్టాలని చూడడం ఆకాశంపై ఉమ్మి వేసిన చందంగా ఉంటుందని చెప్పారు. కందుకూరు పార్టీ సమన్వయకర్త తూమాటి మాధవరావు మాట్లాడుతూ 67 రోజులుగా ఆందోళనలు, రాస్తారోకోలు, బంద్‌లు చేస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలకు దున్నపోతుపై వాన కురిసిన చందంగా మారిందని విమర్శించారు. ఢిల్లీలో ఒక మాట, రాష్ట్రానికి వచ్చి మరో మాట చెప్పడం ఆ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందన్నారు. టీ నోట్‌ను వెనక్కు తీసుకోకపోతే పరిస్థితి తీవ్రమవుతుందని ధ్వజమెత్తారు. మరో సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల జిల్లాలో తాగు, సాగు నీటి సమస్య జఠిలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కందుకూరు జేఏసీ నాయకుడు ఆర్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమైక్యాంధ్ర విషయంలో స్పష్టమైన వైఖరితో ఉండాలని పిలుపునిచ్చారు. 67 రోజులుగా ఉద్యమం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొల్లూరి కొండయ్య, రాష్ట్ర పార్టీ బీసీ సెల్ సభ్యుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బూర్సు మాలకొండయ్య, జేఏసీ నాయకులు గాయత్రి రామకృష్ణ, పెరుగు ప్రసాదు, ఏవీ.రావు, టీజే.విలియంతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
సమైక్య ఉద్యమంపైనా టీడీపీ కుట్ర
ఒంగోలు, న్యూస్‌లైన్ : ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. సమైక్య ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రణాళికలో భాగంగా చంద్రబాబు టీడీపీ శ్రేణులకు కొన్ని సూచనలు చేశారని బాలాజీ చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవినీతి ఆరోపణలు గుప్పించడం ద్వారా జనం దృష్టి మరల్చానేది చంద్రబాబు కుట్ర అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ఓకే అంటూ కేంద్రానికి బ్లాంక్ చెక్‌లా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఆత్మగౌరవం పేరుతో బస్సు యాత్ర నిర్వహించడం సిగ్గుచేటన్నారు. యాత్ర ఎందుకు నిర్వహిస్తున్నాడో చెప్పకుండా.. వైఎస్సార్ కుటుంబంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్జీఓలు నిలదీస్తున్నా కనీసం రాష్ట్ర విభజనపై నోరు మెదపకపోవడం చంద్రబాబు నైజాన్ని తెలియజేస్తోందన్నారు. రాష్ట్రపతిని, జాతీయ నాయకులను కలిసి రాష్ట్ర విభజన సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకోవాలని ఢిల్లీ నేతలను కోరడం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందని, అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర కమిటీ నెలరోజుల పాటు షెడ్యూల్ విడుదల చేసిందని పేర్కొన్నారు. అక్టోబరు ఒకటో తేదీన గుంటూరు నుంచి విజయవాడ వరకు ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ ఉంటుందన్నారు. గాంధీ జయంతి రోజు నుంచి జిల్లాలో కూడా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేసేందు కు, ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జిల్లాలోని పార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, గ్రామీణ పరిశ్రమలు, ఉపాధి విభాగం జిల్లా కన్వీనర్ బొగ్గుల శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు రాష్ట్రం బలి
చినగంజాం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలకు రాష్ట్రం బలైపోతోందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా చినగంజాంలో రెండో రోజు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించి దీక్షాధారులకు సంఘీభావం తెలిపారు. అనంతరం బాలాజీ మాట్లాడుతూ సోనియా రాజకీయ అవసరాల కోసం, రాహుల్ ను ప్రధానిని చేయాలనే స్వార్థంతో కలసి ఉన్న రాష్ట్రాన్ని రెండుగా చీల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టే సమయంలో రెండు రాష్ట్రాల్లో సాగు, తాగునీరు, మౌలిక వసతుల గురించి ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదన్నారు. విజయమ్మను విమర్శించే అర్హత బొత్సకు లేదు: వైఎస్ విజయమ్మను విమర్శించే అర్హత పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఏమాత్రం లేదని నూకసాని బాలాజీ అన్నారు. విజయమ్మ రాజకీయ నాటకానికి తెరలేపారని బొత్స విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ఆర్ దయాదాక్షిణ్యాలపై బతికి బట్టకట్టిన బొత్సకు నేడు వైఎస్ సతీమణి విజయమ్మ చేసే దీక్ష గురించి విమర్శించే హక్కులేదన్నారు. బ్రాందీ షాపుల దగ్గర తాగి మాట్లాడే తాగుబోతు మాదిరిగా ఉదయం ఒక మాట, సాయంత్రం ఇంకోమాట సంబంధం లేకుండా మాట్లాడితే ప్రజలు నాలుక చీలుస్తారని హెచ్చరించారు. వైఎస్ విజయమ్మ గురించి బొత్స మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం దీక్షా శిబిరంలో కూర్చొన్న వారిలో రంగని సుబ్బారెడ్డి, కొల్లాటి ఏడుకొండ లు, కుక్కల బురఖాయలు రెడ్డి, కోట రామకృష్ణారెడ్డి, దున్నా ఏడుకొండలు, బక్కా వెంకటేశ్వర్లు రెడ్డి, రాజు శ్రీనివాసరెడ్డి, పల్లెబోయిన అంకిరెడ్డి, ఆసోది నాగార్జున రెడ్డి, కుక్కల పిచ్చిరెడ్డిలను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. సాయంత్రం సంతరావూరు ఎంపీటీసీ సభ్యుడు కల్లి శ్రీనివాసరెడ్డి దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కోట విజయభాస్కర్ రెడ్డి, ఉప్పు కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ షేక్ జిలాని, అక్కల రామకృష్ణారెడ్డి, రత్నారెడ్డి, ధనరాజులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.