ఒంగోలు: ‘పచ్చని ప్రకాశం...పరిశుభ్రమైన ప్రకాశం’లో భాగంగా జిల్లా పరిషత్ తొలి అడుగు వేసింది. ‘పచ్చని ప్రకాశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి విడత శనివారం లక్ష మొక్కలు నాటేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈమేరకు జిల్లా అటవీశాఖ అధికారులతో కూడా చర్చించారు. లక్ష మొక్కలను అటవీశాఖ అధికారులు సిద్ధంగా ఉంచారు.
పాఠశాలలే తొలి లక్ష్యం:
జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పరిధిలో దాదాపు 4 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. లక్ష మొక్కలను పాఠశాలల్లోనే నాటడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలనేది జిల్లా పరిషత్ ఆకాంక్ష. అందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యం తీసుకునే బాధ్యత ఎంపీడీవోలపై ఉంచారు. ప్రతి పాఠశాలలో కనీసం 25 మొక్కల చొప్పున పెంచాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో స్థలాభావం వల్ల మొక్కలు పెంచలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఆవరణ, గ్రంథాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని దిశా నిర్దేశం చేశారు.
నేడు ‘పచ్చని ప్రకాశం’
Published Sat, Sep 20 2014 3:39 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement