ఒంగోలు సబర్బన్ : జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఈదర హరిబాబు తీరుపై ప్రజాసంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు నగరంలో మంగళవారం రాత్రి ఆందోళనకు దిగాయి. కండబలంతో బీసీలను అణగదొక్కి జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం అప్రజాస్వామికమని గళమెత్తాయి.
హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పుకోస్తున్న ఈదర.. కోర్టు నుంచి కలెక్టర్‌కు, జెడ్పీ కార్యాలయానికి ఉత్తర్వులు రాకుండానే మంది బలంతో జెడ్పీ పీఠంపై ఎలా కూర్చుంటారని ప్రశ్నించారు. 99 బీసీ కులాల సమాఖ్య ఆధ్వర్యంతో పాటు పలు దళిత సంఘాలు, ప్రజాసంఘాలు కూడా ఈ విషయమై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాయి.
కలెక్టర్‌ను కలిసిన నూకసాని
జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మంగళవారం రాత్రి కలెక్టర్ విజయకుమార్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. జెడ్పీ చైర్మన్ పీఠం వ్యవహారాన్ని ఆయనతో బాలాజీ చర్చించారు. అనంతరం బయటకు వచ్చిన నూకసాని మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికీ తానే జిల్లా పరిషత్ చైర్మన్‌నని, కలెక్టర్ కూడా అదే మాట చెప్పారని వివరించారు.
హైకోర్టు ఆర్డర్ ఇంత వరకు కలెక్టరేట్‌కుగానీ, జిల్లా పరిషత్ కార్యాలయానికిగానీ రాలేదని చెప్పారు. దౌర్జన్యంగా, అప్రజాస్వామికంగా జెడ్పీ పీఠంపై ఈదర హరిబాబు కూర్చోవటాన్ని నూకసాని తీవ్రంగా ఖండించారు. జెడ్పీ చైర్మన్ వ్యవహారంపై కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి కూడా కలెక్టర్‌తో చర్చించినట్లు సమాచారం.
ఇప్పటికీ జెడ్పీ చైర్మన్‌ను నేనే : నూకసాని
Published Wed, Nov 12 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement