ఉద్యమంలా వైఎస్సార్ సీపీ సమైక్యనాదం
Published Thu, Jan 30 2014 2:17 AM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM
సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడగపడకు సమక్యనినాదం ఉద్యమంలా సాగుతోంది. ఊరు..వాడా అనే తేడా లేకుండా సమైక్యహోరు మారుమోగుతోంది. యువకులు, మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ పార్టీ శ్రేణులతో కలసి సమైక్యాంధ్ర కోసం నినదిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వెల్లువెత్తుతున్న జనాదరణ, రోజురోజుకు బలపడుతున్న వైఎస్సార్ సీపీని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీలు ఎల్లో మీడియాతో కలిసి దుష్ర్పచారం చేస్తున్నాయని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పేర్కొన్నారు. మామిడికుదురు మండలం ఆదుర్రులో బుధవారం గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పి.గన్నవరం, రాజోలు కో ఆర్డినేటర్లు కొండేటి చిట్టిబాబు, బొంతు రాజేశ్వరరావులతో పాటు జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, రైతు విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు జక్కంపూడి తాతాజీ పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మండలం జంబూపట్నంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ పాదయాత్ర చేశారు. ప్రత్తిపాడు కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామంలో గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేట కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆత్రేయపురం మండలం పులిదిండిలో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సమైక్యాంధ్ర కోసం పోరాడేది జగన్ ఒక్కరే
సమైక్యాంధ్ర కోసం అలుపెరగక పోరాడుతున్నది జననేత ఒక్కరేనని పిఠాపురం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం పట్టణ పరిధిలోని 1వ వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. సమైక్యాంధ్ర వల్ల కలిగే ప్రయోజనాలు. వైఎస్సార్‌సీపీ విధి విధానాల కరపత్రాలను ఇంటింటికి తిరిగి పంచిపెట్టారు. కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్, జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇంద్రపాలెంలో గడప గడపకు వైఎస్సార్‌సీపీ నిర్వహించారు. ఈసందర్భంగా పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు పెద్దాపురం మండలం ఆర్‌బీ కొత్తూరులో గడపగడపకు వైఎస్సార్‌సీపీ నిర్వహించారు.
వందలాది మంది సుబ్బారావు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు రూరల్ మండల పరిధిలోని కొంతమూరులోనూ, తుని కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా పట్టణంలోని ఒకటవ వార్డు పరిధిలోనూ గడపగడపకు వైఎస్సార్ సీపీ పాద యాత్రలు చేశారు. రాజమండ్రి 29వ వార్డు పరిధిలోని కొత్తపేట ప్రాంతంలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ నిర్వహించారు. పార్టీ కో ఆర్డినేటర్ బొమ్మన రాజ్
కుమార్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి పార్టీ కరపత్రాలను పంచిపెడుతూ విభజన వల్ల కలిగే నష్టాలను వివరించారు.
Advertisement
Advertisement