'విభజన బిల్లును కాల్చడం ప్రజాస్వామ్యానికి అవమానం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు ప్రతులను సమైక్య వాదులు భోగి మంటల్లో కాల్చడం ప్రజాస్వామ్యానికి అవమానమనం ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో వారిపై చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పొంగులేటి..సమైక్య వాదులు ఎన్ని ఆటంకాలు కల్గించినా విభజన ఆగదని స్పష్టం చేశారు.
అవసరమైతే కేంద్రం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును ఆమోదింప జేస్తుందన్నారు. ఈ నెల 17 వ తేదీన ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సదస్సులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలన్నారు.