రాష్ర్ట సమైక్యత కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి అండగా నిలవండి.. సమై క్యాంధ్ర కోసం అలుపెరగక పోరు సల్పుతున్న వైఎస్ జగన్‌కు బాసటగా నిలవండి..
సాక్షి, కాకినాడ :
రాష్ర్ట సమైక్యత కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి అండగా నిలవండి.. సమై క్యాంధ్ర కోసం అలుపెరగక పోరు సల్పుతున్న వైఎస్ జగన్‌కు బాసటగా నిలవండి.. విభజన కుట్రలను అడ్డుకోండి అంటూ పార్టీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మండలం గుమ్మిలేరులో సమైక్య నినాద పాదయాత్ర చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ నాయకుడు బొడ్డు అనంత వెంకట రమణచౌదరితో కలిసి పురవీధుల్లో పాదయాత్ర చేసి రాష్ర్టం ముక్కలైతే జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు.
రాజమండ్రి 32వ డివిజన్ పరిధిలో నగర కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ సమైక్య పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో బొడ్డు అనంత వెంకటరమణచౌదరి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ నయీం, మైనార్టీ సెల్ రాష్ర్ట కమిటీ సభ్యుడు అహ్మద్ పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ పార్టీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు హుకుంపేటలో, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఏలేశ్వరంలో గడపగడపకు పాదయాత్ర నిర్వహించారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ నాయుడు వాలుతిమ్మాపురంలో, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఇంద్రపాలెంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ సమైక్యపాదయాత్ర నిర్వహించారు. అలాగే జగ్గంపేట మండలం గుర్రప్పాలెంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్‌ఆర్ సీపీని నిర్వహించారు.