అనంతపురం: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచి వేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీమాంధ్ర ఉద్యమ సెగలు ఏడో రోజు కూడా ఎగసి పడటంతో పోలీసులు ఆ ఉద్యమాన్ని అణచి వేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ఉద్యమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నేత ఎర్రస్వామి రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎర్రస్వామని ఏ కారణం లేకుండా అరెస్టు చేయడంపై వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాపటు చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలో ఉద్యమం ఉదృతమైన సంగతి తెలిసిందే. ఏడో రోజు కూడా సమైక్యాంధ్ర కోరుతూ ఆందోళన కారులు కదం తొక్కారు. అంతకంతకూ సీమాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. దీంతో నిరసనకారులను అరెస్టు చేస్తూ.. ఉద్యమాన్ని అణచి వేసేందుకు యత్నిస్తున్నారు. ఆందోళనలో భాగంగా మంగళవారం ఉద్యమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసుల అదుపులోకి తీసుకుంటున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అణచేందుకు కుట్ర
Published Tue, Aug 6 2013 6:33 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM