అదుపులో అతిసార | Diarrhoeal under control | Sakshi
Sakshi News home page

అదుపులో అతిసార

Published Sat, Jul 30 2016 7:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

గ్రామంలో పర్యటిస్తున్న తహసీల్దార్, ఎంపీడీఓ

గ్రామంలో పర్యటిస్తున్న తహసీల్దార్, ఎంపీడీఓ

ఊపిరిపీల్చుకున్న బండపోతుగళ్‌ గ్రామస్తులు
కౌడిపల్లి : మండలంలోని బండపోతుగళ్‌లో అతిసార అదుపులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా గ్రామంలో అతిసార  విజృంభించడంతో గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. గ్రామంలో నాలుగో రోజైన  శనివారం కూడా  డాక్టర్‌ విజయశ్రీ, డ్టాక్టర్‌ దివ్యజ్ఞ, సిబ్బంది ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించారు.

గ్రామానికి చెందిన 12 మందికి వాంతులు విరేచనాలు కావడంతో చికిత్స చేశారు. దీంతోపాటు 32 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. తహసీల్దార్‌ నిర్మల, ఎంపీడీఓ శ్రీరాములు, ఈఓ పీఆర్డీ సత్యనారాయణ ఎంపీహెచ్‌ఈఓ సురేందర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ చిన్ని నాయక్‌, వైద్యసిబ్బంది గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. 

గ్రామస్తులకు అధికారులు మినరల్‌ వాటర్‌ బాటిళ్లను సరఫరా చేశారు. పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు.  సంగారెడ్డి, జోగిపేటలో చికిత్స పొందుతున్నవారు సైతం కోలుకుంటున్నారు.  సర్పంచ్‌ విఠల్‌,  మాజీ సర్పంచ్‌ మల్లారెడ్డి గ్రామస్తులు సయ్యద్‌ హుస్సేన్‌, షఫి, పోచయ్య, మాణిక్యం తదితరులు అధికారులకు సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement