వరుడు వేటలో ఉన్నా! | Adah Sharma Says Her Looking For Groom | Sakshi
Sakshi News home page

వరుడు వేటలో ఉన్నా!

Published Sat, Sep 28 2019 8:17 AM | Last Updated on Sat, Sep 28 2019 8:21 AM

Adah Sharma Says Her Looking For Groom - Sakshi

పెళ్లి కొడుకు వేటలో ఉన్నానంటోంది నటి ఆదాశర్మ. తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ కోలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో కనిపించింది. ముఖ్యంగా సంచలన జంట శింబు, నయనతార జంటగా నటించిన ఇదు నమ్మఆళు చిత్రంతో తమిళ సినిమాకు పరిచయమైంది. అందాలారబోతకు హద్దులు చెప్పని ఈ బ్యూటీని ఏ భాషలోనూ స్టార్‌డంను అందుకోలేకపోయింది. అయినా తరచూ ఫొటో సెషన్స్‌ నిర్వహించుకుంటూ ఆ ఫొటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్‌చేస్తూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అలాంటి ఆదాశర్మ దృష్టి పెళ్లిపైకి మళ్లిందట. అందుకే నేను పెళ్లికి రెడీ అయ్యాను. పెళ్లి కొడుకు వేటలో ఉన్నాను అంటూ తన ట్విట్టర్‌లో పేర్కొంది. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఆ వచ్చేవాడికి ఈ జాణ పెట్టే కండిషన్లే కాస్త విచిత్రంగా ఉన్నాయి.

అవేంటో కూడా ఆదాశర్మ బయట పెట్టేసింది.  ముఖ్యంగా ఉల్లిపాయలు తినకూడదు. ఇంటిలో జీన్స్‌ డ్రెస్‌ వేసుకున్నా పర్వాలేదు గానీ, బయటకు వెళ్లేటప్పుడు మాత్రం కచ్చితంగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. ఇక అసలు విషయం ఏమిటంటే నిత్యం ముప్పూటలా చిరునవ్వు ముఖం మీద చెరగకుండా వంట చేయాలి. మద్యం, మాంసాహారాలు నిషిద్ధం. భారతీయ భాషలన్నింటినీ గౌరవించాలి వంటి నిబంధనలు పాఠించాలని పేర్కొంది. అంతేనా అంటే జాతి, మతం, రంగు, జాతకం, షూ సైజ్, వీసా, ఈతలో ప్రతిభ, ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్‌ వంటి వాటి గురించి నాకేమీ అభ్యంతరాలు ఉండవు అని చెప్పింది. ఇదంతా సరే. ఈ లక్షణాలన్నీ కలిగిన పెళ్లి కొడుకు ఈ రోజుల్లో ఆదాశర్మకు దొరుకుతాడా అన్నదే ప్రశ్న. ఏదేమైనా తనకు కాబోయేవాడు ఇలా ఉండాలని ముందుగానే బయట పెట్టేసింది. ఆమె నిబంధనలు నచ్చితే ఎవరైనా భర్త పోస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement